TSPSC Group-1 : నేడు గ్రూప్-1 అప్లికేషన్లకు లాస్ట్ డేట్.. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?

563 గ్రూప్ -1 ఖాళీల భర్తీకి గత నెల 23 నుంచి టీఎస్పీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. నిన్నటిలోగా 2.7 లక్షల అప్లికేషన్లు రాగా.. ఈ రోజు ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

New Update
Group-1: గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

Group - 1 Application : తెలంగాణ(Telangana) లో మొత్తం 563 గ్రూప్-1 ఉద్యోగాల(TSPSC Group-1 Jobs) భర్తీకి రేవంత్ సర్కార్ ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ(TSPSC Group-1 Application Process) అదే నెల 23 నుంచి ప్రారంభించింది టీఎస్పీఎస్సీ (TSPSC). అయితే.. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే మార్చి 14న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. బుధవారం సాయంత్రం నాటికి మొత్తం 2.7 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఆఖరి రోజు కావడంతో ఈ రోజు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో తమ దరఖాస్తులను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ల ఎడిట్ ఆప్షన్: మార్చి 23-మార్చి 27

ప్రిలిమ్స్: జూన్ 9

మెయిన్స్: అక్టోబర్ 21 నుంచి..

Also Read : Group-1 Notification: గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల

గతంలో 2 సార్లు పరీక్ష రద్దు..
గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో 503 ఖాళీలతో 2022 ఏప్రిల్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమ్స్ సైతం నిర్వహించి ఫలితాలను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. కానీ, పేపర్ లీకేజీ వ్యవహారం బయటపడడంతో పరీక్షను రద్దు చేశారు. మరో సారి 2023 జూన్ 11న పరీక్ష నిర్వహించగా.. బయోమెట్రిక్ తీసుకోలేదన్న కారణంతో హైకోర్టు మరో సారి పరీక్షను రద్దు చేసింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ పాత నోటిఫికేషన్ ను రద్దు చేసింది.. మరో 60 పోస్టులను కలిపి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

తగ్గిన అప్లికేషన్లు..
వరుసగా రెండు సార్లు పరీక్ష రద్దు కావడంతో నిరుద్యోగుల్లో గ్రూప్-1పై ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. గతంలో గ్రూప్-1 కు మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. ఈ సారి పోస్టులు పెరిగినా ఇప్పటి వరకు 2.7 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసే సమయానికి ఈ సంఖ్య 3 లక్షలు కూడా దాటే అవకాశం కనిపించడం లేదు.

Also Read : Group-1: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే నోటిఫికేషన్..

Advertisment
Advertisment
తాజా కథనాలు