TS PECET: టీఎస్ పీఈసెట్-2024 షెడ్యూల్ విడుదల.. టీఎస్- పీఈసెట్-2024 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. మే 15న దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ. పీఈసెట్ ద్వారా బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. By B Aravind 19 Feb 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TS PECET 2024: తెలంగాణలో పీఈసెట్-2024కు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, శాతవాహన యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేష్ కలిసి ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. అలాగే మార్చి 12న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 14 నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. మే 15న దరఖాస్తు సమర్పణకు చివరి తేదీగా నిర్ణయించారు. Also Read: రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్ లా? ఇది అన్యాయం:ఎమ్మెల్సీ కవిత ఇక ఆలస్య రుసుముతో మే 31వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే జూన్ 10 నుంచి 13వ తేదీ మధ్యలో టీఎస్-పీఈసెట్ రాతపరీక్షలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. టీఎస్ పీఈసెట్ ద్వారా బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది టీఎస్ పీఈసెట్ పరీక్షలను శాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తుంది. Also Read: మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమలు.. షరతులు వర్తిస్తాయి #telugu-news #telangana-news #ts-pecet-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి