Weather : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌!

రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో ఎండలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
Weather : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌!

Orange Alert : గత కొద్ది రోజులుగా తెలంగాణ(Telangana) లో ఎండలు అదరగొడుతున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో ఎండలు(Sun) మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు(Weather Officials) హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

మార్చి 27 నుంచి 30 వరకు కూడా నిర్మల్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్‌ నగర్‌, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు అధికారులు ఆరెంజ్‌ అలెర్ట్‌ ను జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే రాత్రిపూట కూడా అత్యధికంగా 28 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.

రాష్ట్రంలో 28 నుంచి వేడిగాలులు కొనసాగుతాయని, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో ఎండ తీవ్రత ఎకువగా ఉంటుందని వాతవరణ శాఖ పేర్కొంది.

Also Read : సెలవులకు ఊరెళ్తున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే.. రైలు సర్వీసులు పొడిగింపు!

Advertisment
Advertisment
తాజా కథనాలు