రోజుకు 6 ఆటలు .. టికెట్స్ ధరలు పెంపుకై గ్రీన్ సిగ్నల్

New Update
రోజుకు 6 ఆటలు .. టికెట్స్ ధరలు పెంపుకై గ్రీన్ సిగ్నల్

GUNTURU KAARAM: సంక్రాంతి సినిమాల ఘాటు మాములుగా లేదు.భారీ  బడ్జెట్ తో తెరకెక్కించి వసూళ్ళు రాబట్టుకోవడంలో ఈ సీజన్ కు మించిన సీజన్ లేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆరంభంలో సంక్రాతికి  సినిమాలు రిలీజవుతున్నాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్;లో  తెరకెక్కి అత్యధిక సినిమాహాళ్ళలో  రిలిజవుతున్న గుంటూరు కారం సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్ని ఎక్కువ థియేటర్స్ రిలీజ్ చేసినా సరే . మొదటి మూడు రోజుల వసూళ్ళు చాలా కీలకం. ఈ మూవీ చాలా పెద్ద సినిమా కాబట్టి  టికెట్స్ ధరలతో పాటు ,   షో లు సైతం పెంచాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలి.

రోజుకు 6 ఆటలు .. టికెట్స్ ధరలు పెంపుకై గ్రీన్ సిగ్నల్

గుంటూరు కారం మూవీ టికెట్ల ధరలు,పెంపుకై తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా స్పందిచంది. అంతే కానుందా రోజుకు 6 షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారే చేసింది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ ఫ్యాన్సే పండగ చేసుకుంటూన్నారు.  త్రివిక్రమ్ శ్రీనివాస్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను  హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల , మీనాక్షి చౌదరే జంటగా వస్తోన్న ఈ మూవీలో జగపతిబాబు పాత్ర చాలా హైలెట్ గా ఉంటుందని ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది.

https://x.com/TeluguScribe/status/1744652240626000255?s=20

శ్రీలీల ఆశలన్నే ఈ సినిమాపైనే

ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో చలా క్రేజ్ ఉన్న హిరోయిన్ శ్రీలీల. స్కంద మూవీ నిరాశ పరచడంతో శ్రీలీల ఆశలన్నీ గుంటూరు కారం మూవీ పైనే పెట్టుకుంది.ఇక.. మీనాక్షి చౌధరీ అయితే ఇక చెప్పే అవసరం లేదు. మీనాక్షి ఎన్నో హోప్స్ పెట్టుకుంది. ట్రైలర్ చూస్తుంటే గుంటూరు కారం ఘాటు చాలా ఎక్కువగానే ఉంది. త్రివిక్రమ్ శైలికి భిన్ననగా ఊరమాస్ లుక్ లో సినిమా ఉండబోతోందని ట్రైలర్ లో తెలుస్తోంది. ఇక.. రమ్యకృష మహేష బాబుకు తల్లిగా అలరించబోతోంది. సినిమా ఆద్యంతం పొలిటకల్ థ్రిల్లర్ ని తలపించేలా ఉంటూ భావోద్వేగాల చుట్టూ కథ నడుస్తుంది.

ఆరంభం నుంచి ఆటంకాలే

గుంటూరు కారం సినిమాకు మరో ప్రధాన భలం యస్ యస్ తమన్. ఇప్పటికే రిలీజయిన పాటలు దుమ్మురేపుతున్నాయి. ట్రైలర్ లో నేపద్యసంగీతం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ మూవీ స్టార్ట్ అయిన నాటి నుండి నేటివరకు ఎన్నో వివాదాలకు కేంద్రభిందువు అయింది. సంగెత సాహిత్యాల పరంగానే కకుండా .. సినిమా షూటింగ్ లోకూడా జాప్యం జరిగింది. ఈ మూవీ స్టార్ట్  అయిన సమయంలోనే మహేష్ కుటుంభంలో విషాదాలు చోటు చేసుకోవడం జరిగాయి. అన్ని ఆటుపోట్లను తట్టుకుని ఎట్టకేలకు సంసంక్రాంతి బరిలోకి దిగుతున్న గుంటూరు కారం మూవీపై భారీ అన్చాలు నెలకొన్నాయి.

ALSO READ;Dil Raju: ఏంటి పీకేది అంటూ రిపోర్టర్స్ పై దిల్ రాజు ఫైర్ ..

Advertisment
Advertisment
తాజా కథనాలు