Soups Benefits: చలికాలంలో ఈ సూప్‌లు ట్రై చేయండి..ఎన్నో ప్రయోజనాలు

చలికాలంలో పొగమంచు, గజగజ వణికించే చలి ఉంటుంది. చలికాలంలో చలితో రోజంతా ఇబ్బంది పడేవాళ్లు కొన్ని సూప్స్ తాగటం వలన చల్లటి చలిలో గరం గరంగా ఉంటుంది. కంది, శనగ పప్పు రసం, బీట్ రూట్ చికెన్ సూప్, పాలకూర సూప్ తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

New Update
Soups Benefits: చలికాలంలో ఈ సూప్‌లు ట్రై చేయండి..ఎన్నో ప్రయోజనాలు

Soups Benefits: రోజు రోజుకు వాతావరణం (Climate)లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత కూడా బాగా పెరిగిపోయింది. చలిని తట్టుకోవాలంటే వేడివేడిగా ఆహార పదార్థాలు తినడం లేదా వేడివేడి పానీయాలు తీసుకుంటూ ఉంటాం. కొన్ని రకాల సూప్స్‌ చేసుకుని తాగితే చలిబారి నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా శరీరాన్ని కూడా వెచ్చగా ఉంచుకోవచ్చు. అయితే చలికాలంలో ఏయే సూప్‌లు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సూప్‌ (Soup) తాగితే కలిగే లాభాలు

పాలకూర సూప్: చలికాలం వచ్చిందంటే చాలు రాత్రి సమయంలో శరీరం బద్దకంగా మారుతుంది. చల్లగా ఉన్న కూరలు, అన్నం తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే పాలకూర తీసుకుంటే మన శరీరానికి తగిన వేడి అందుతుంది. అంతేకాకుండా రోజంతా యాక్టివ్‌గా ఉంటాం. ప్రతిరోజు పాలకూర తినాలంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయితే ఇలా సూప్‌గా చేసుకుని భోజనం సమయంలో తాగితే మంచి ఫలితం ఉంటుంది. పాలకూర సూప్‌ను తయారు చేసుకోవడానికి పాలకూరను చిన్నగా తరిగి తాలింపు వేసుకోవాలి. ఆ తర్వాత నీళ్లు కలిపి మెత్తగా చేసుకుని తాగవచ్చు.

బీట్‌రూట్‌ (Beetroot), చికెన్ సూప్: బీట్‌రూట్‌ అందరికి కామన్‌గా దొరుకుతుంది. ఈ బీట్‌రూట్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇక బీట్‌రూట్‌, చికెన్ కలిపి సూప్ తయారు చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం. చికెన్ ముక్కలతో పాటు బీట్‌రూట్‌ ముక్కలను కడిపి ఉడికించుకోవాలి. ఆ తర్వాత నల్ల మిరియాలు, అల్లం వేసి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు పోసి చికెన్ మసాలా వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత కాస్త కొత్తిమీర ఆకులు వేసుకుంటే చూసేందుకు అందంగా మరియు రుచిగా ఉంటుంది.

కందిపప్పు, శనగపప్పు రసం: ఇది ఏ సీజన్లో అయినా మంచి పోషకాలను కలిగి ఉంటుంది. రాత్రి సమయాల్లో, అది కూడా చలికాలం అన్నం తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్లు ఈ సూపులు ట్రై చేయవచ్చు. రుచితో పాటు మన శరీరానికి తగిన వేడి దీని వల్ల లభిస్తుంది. కందిపప్పు, శనగలు తాలింపు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మిక్సీలో వేసి రసంలా చేసుకుని అన్నంలో కలిపి తింటే బాగుంటుంది.

ఇది కూడా చదవండి: పొద్దున్నే తుమ్ములు వస్తున్నాయా..ఈ చిట్కాలు మీకోసం

Advertisment
Advertisment
తాజా కథనాలు