Head Massage: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ నూనెలతో హెడ్ మసాజ్ ట్రై చేయండి ఈ మధ్య కాలంలో చాలామంది జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని నూనెలు, షాంపులు వాడిన సమస్య తగ్గకపోగా.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ సమస్యను దూరం చేయాలంటే ఈ నూనెలతో మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. By Vijaya Nimma 18 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Best head massage oils: హెడ్ మసాజ్ మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. మర్దన చేసుకోవడం వల్ల రక్త ప్రసరణను మెరిగి.. తల, మెడ కండరాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా మాడుకు రక్తప్రసరణ సక్రమంగా జరిగి హెయిర్ గ్రోత్ పెరగటానికి కృషి చేస్తుంది. రోజు గోరువెచ్చని నూనెతో మాడుకు మర్దన చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. స్ట్రెస్, తలనొప్పి, అలసట ఉంటే హెడ్ మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నూనెతో తరచూ మర్దన చేసుకుంటే కురులు మిలమిలా మెరుస్తాయి.. ఒత్తుగా కనిపిస్తాయి. హెడ్ మసాజ్‌కు ఏ నూనె అయితే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: మలబద్ధకం వేధిస్తుందా..? ఈ డ్రింక్స్‌ను తాగి చూడండి కొబ్బరి నూనె: చాలామంది జుట్టు సంరక్షణకు కొబ్బరినూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నూనెలో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఉన్న నూనెతో 20 నిమిషాలు మసాజ్ చేస్తే చుండ్రు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, హెయిర్ ఫాల్‌తోపాటు మాడును, జుట్టును తేమగా ఉంచుతుంది. 24 గంటల తరువాత తలస్నానం చేయాలి. ఆవ నూనె: ఆవ నూనెతో తల మసాజ్ చేసిన మంచి ఫలితం ఉంటుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు, శిలీంధ్రాలు, జుట్టులో ఉంటే బ్యాక్టీరియా, పరాన్నజీవులతో పోరాడి మాడు, జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. జుట్టుకు తేమనందించి పట్టులా మృదువుగా ఉండాలంటే ఆవాల నూనెను వేడి చేసి15 నిమిషాల పాటు తలపై మసాజ్ చేయాలి. బాదం నూనె: బాదం నూనె హెడ్ మసాజ్‌కు మంచి ఫేమస్. ఈ నూనెలో విటమిన్-ఈ, ఒమేగా-3, మెగ్నీషియం, ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ జుట్టుకు పోషణ ఇచ్చి.. జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి, తలలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. బాదం నూనెతో 10 నిమిషాల పాటు హెడ్ మసాజ్ చేస్తే.. జుట్టు పట్టులా మారి.. స్ప్లిట్ ఎండ్స్ సమస్య దూరం అవుతుంది. ఉదయం తలస్నానం చేయాస్తే మంచిది. లావెండర్ ఆయిల్: ఆందోళన, సువాసన ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలను దూరం చేయడంలో లావెండర్ ఆయిల్ బెస్ట్. దీనిని సువాసన చూసిన మనస్సును ప్రశాంతంగా ఉంచుతోంది. లావెండర్ ఆయిల్ హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహించి..మాడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. లావెండర్ ఆయిల్‌తో హెడ్ మసాజ్ చేసుకోవడానికి.. బాదం, కొబ్బరి, వంటి క్యారియర్ ఆయిల్స్‌లో కొన్ని చుక్కలు లావెండర్ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. 15 నిమిషాల పాటు హెడ్ మసాజ్ చేసి ఉదయం తలస్నానం చేయాలి. గమనిక: అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆరోగ్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమ. ఈ న్యూస్ మీకు అవగాహన కోసమే. #health-benefits #oils #head-massage #thicker-hair మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి