Trump Discharged: ఆసుపత్రి నుంచి డోనాల్డ్ ట్రంప్ డిశ్చార్జ్ అమెరికాలోని పిన్సిన్వేలియాలో నిర్వహిస్తున్న ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. కుడి చెవికి గాయం కావడంతో ఆయనను భద్రతా సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ట్రంప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. By KVD Varma 14 Jul 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Trump Discharged: దుండగుల దాడిలో గాయపడిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయ్యారు. పిన్సిన్వేలియాలో ఒక సమావేశంలో ట్రంప్ పాల్గొన్న సమయంలో ఆయన్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయి. దీంతో ఒక బుల్లెట్ ట్రంప్ కుడిచెవిని రాసుకుంటూ పోయింది. చెవికి గాయం కావడంతో ట్రంప్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స జరిపిన తరువాత డిశ్చార్జ్ చేశారు. గాయం చిన్నదే కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించినట్టు వైద్యులు తెలిపారు. ఏం జరిగింది.. Trump Discharged: అమెరికాలోని పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. కాల్పుల అనంతరం ట్రంప్ ముఖం రక్తసిక్తమైంది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్ వేదికపై మాట్లాడుతుండగా కాల్పుల మోత మోగింది. పేలుడు శబ్ధానికి ట్రంప్ వేదికపై పడిపోయారు. ట్రంప్‌ను వెంటనే అతని భద్రతకు కేటాయించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదికపై నుంచి దింపారు. ఈ సమయంలో, ట్రంప్ ముఖం, చెవులపై రక్తం కనిపించింది. Also Read: ట్రంప్ పై దాడిని ఖండించిన బైడెన్! Trump Discharged: ట్రంప్ ర్యాలీలో కాల్పులు జరిపిన నిందితుడు హతమైనట్లు బట్లర్ కౌంటీ జిల్లా అటార్నీ రిచర్డ్ గోల్డింగర్ తెలిపారు. దీంతో పాటు ర్యాలీలో పాల్గొన్న ఒక వ్యక్తి కూడా మృతి చెందాడు. డోనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ఉన్నారు. ఘటన జరిగిన తరువాత ఆయన భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గాయపడిన ట్రంప్‌ను సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, ఈ దాడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ కాల్పుల ఘటనతో అమెరికాతో పాటు ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. #america #donald-trump మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి