Travel in Pregnancy: ప్రెగ్నెన్సీలో ప్రయాణమా.. జాగ్రత్త సుమా.. 

గర్భిణీలు ఎక్కువ దూరం ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరై వెళ్ళవలసి వస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్, రిపోర్ట్స్, మెడిసిన్స్, మంచినీరు, ఆహరం అన్నిటినీ జాగ్రత్తగా దగ్గర ఉండేలా చూసుకోవాలి. విమానం లేదా రైలు  లేదా బస్సు మీ సీటు విషయంలో కంఫర్ట్ ఉండేది ఎంచుకోవాలి. 

New Update
Travel in Pregnancy: ప్రెగ్నెన్సీలో ప్రయాణమా.. జాగ్రత్త సుమా.. 

Travel in Pregnancy: ప్రెగ్నెన్సీ ఫేజ్ అనేది ఏ స్త్రీకైనా సంతోషకరమైన సమయం, అయితే ఇది చాలా సున్నితమైన సమయం. ఈ సమయంలో ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గర్భధారణ సమయంలో, అక్కడికక్కడే తిరగడం..  తక్కువ దూరం ప్రయాణించడం ఫర్వాలేదు, కానీ ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టం. ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో ప్రయాణాలకు దూరంగా ఉండాలి. దీని తర్వాత కూడా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

రైలు, బస్సు, ప్రైవేట్ వాహనం లేదా విమానం కావచ్చు, గర్భధారణ సమయంలో ప్రయాణించేటప్పుడు(Travel in Pregnancy) ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీరు గర్భధారణ సమయంలో విమానంలో ప్రయాణించవలసి వస్తే, టికెట్ బుక్ చేసుకునే ముందు, ఎయిర్‌లైన్స్ నుంచి నియమాలు ఏమిటో తెలుసుకోండి. 36వ వారం గర్భిణీ వరకు కూడా విమాన ప్రయాణం సురక్షితమైనదిగా పరిగణిస్తున్నప్పటికీ,  విమానయాన సంస్థలు వేర్వేరు నియమాలను కలిగి ఉండవచ్చు. ఇక గర్భిణీలు ప్రయాణాల్లో ఎటువంటి  జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

సీటు ఎంపిక.. 

గర్భధారణ సమయంలో చాలా సౌకర్యం అవసరం.  కాబట్టి రైలు లేదా విమానంలో మీకు సౌకర్యవంతంగా ఉండే సీటును పొందటానికి ప్రయత్నించండి. దీనివలన మీరు అలసిపోకుండా ఉంటారు. మీ శరీరం తగిన విశ్రాంతి పొందుతుంది. కాస్త కదలటానికి వీలుగా ఉండేలా సీటు ఉంటె మంచింది. ఎందుకంటే, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం సమస్యలను కలిగిస్తుంది.

మందులు మర్చిపోవద్దు.. 

గర్భధారణ సమయంలో(Travel in Pregnancy), మహిళలు తరచుగా వాంతులు, వికారం - తల తిరగడం వంటి సమస్యలను కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితిలో, ప్రయాణ సమయంలో ఎటువంటి సమస్య తలెత్తకుండా వైద్యుడిని సంప్రదించిన తర్వాత కొన్ని మందులను మీ వద్ద ఉంచుకోండి. అదే సమయంలో, నిత్యం తప్పనిసరిగా వేసుకోవాల్సిన కొన్ని మందులు ఉంటే, వాటిని మీతో తీసుకువెళ్లడం మర్చిపోకండి. ఎందుకంటే, మీరు వాడుతున్న మందులు అన్ని ప్రదేశాల్లోనూ దొరికే అవకాశాలు ఉండవు. 

ఆహార పదార్థాలు కూడా.. 

విమానంలో ఆహార పదార్థాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ, మీ సౌలభ్యం కోసం మీరు ఇప్పటికీ కొన్ని ఆహార సంబంధిత వస్తువులను మీతో ఉంచుకోవచ్చు.  అయితే, దీని కోసం మీరు విమానయాన సంస్థల నియమాలను పాటించాలి. మీరు రైలు లేదా బస్సులో ప్రయాణిస్తున్నట్లయితే, మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.  ప్రయాణ సమయంలో బయటి ఆహారాన్ని తినకుండా ఉండండి.

Also Read: ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే సలార్.. ప్రభాస్ హిట్ కొట్టాడా?

సౌకర్యవంతమైన పిల్లో.. 

ప్రయాణంలో మీరు సౌకర్యవంతమైన పిల్లో మీతో ఉంచుకోవచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో కొద్దిసేపు కూర్చోవడం వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది. పిల్లో మీ వెంట ఉంటే ఆ కుషన్‌పై ఆనుకుని హాయిగా కూర్చోవచ్చు.

ఏదిఏమైనా పెగ్నెన్సీ సమయంలో ప్రయాణాలను దూరం పెట్టడమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి. వేగంగా నడవడం.. రైలు, విమానం వంటివి ఎక్కేటప్పుడు తొందరపడటం మంచిది కాదు. అలానే, మీ హాస్పిటల్ డాక్యుమెంట్స్ అంటే ప్రిస్క్రిప్షన్ నుంచి స్కాన్ రిపోర్ట్స్ వరకూ వెంట ఉంచుకోవడం తప్పనిసరి అని మర్చిపోకండి. ఏదైనా ఎమర్జెన్సీ అయినపుడు మీరు వెళ్లిన ప్రాంతంలోని డాక్టర్ కు మీ ఆరోగ్య పరిస్థితి గురించి ఈ డాక్యుమెంట్స్ సులభంగా అర్ధం అయ్యేలా చెబుతాయి. దీనివలన మీ అనారోగ్య సమస్యకు మంచి మందులు ఇచ్చే అవకాశము వారికీ ఉంటుంది. తాగే నీటి విషయంలో పూర్తి స్థాయిలో జాగ్రత్త ఉండాలి. గర్భిణిగా ప్రయాణించేటప్పుడు వీలైనంతలో విశ్రాంతిగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు