National: ప్రపంచ ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై ట్రయల్ రన్..

జమ్మూ-కాశ్మీర్‌లోని నిర్మించిన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జం మీద ట్రయల్ రన్ నిర్వహించారు. రాంబన్ నుంచి రియాసి స్టేషన్‌ వరకు ట్రైన్ ఇంజన్‌ను టెస్ట్ చేశారు. ఇది సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. ఈ వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

New Update
National: ప్రపంచ ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై ట్రయల్ రన్..

Cheenab Railway Bridge: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెన నిర్మాణం నిన్నటితో పూర్తయింది. జ్మూలోని చీనాబ్ నది మీద దీన్ని నిర్మించారు. దీని ద్వారా రాంబన్ జిల్లాలో నుంచి సవగల్దాన్ నుంచి రియాసి మధ్య ట్రైన్ సేవలు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో ఇదే అతి పెద్ద రైల్వే ప్రాజెక్ట్. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని ఉత్తర రైల్వే తెలిపింది. ఈ రైల్వే బ్రిడ్జ్ ఎత్తు 359 మీటర్లు, మొత్తం పొడవు 1.3 కి.మీటర్లు. ఈ బ్రిడ్జిపై మొదటి రైలు ట్రయల్‌ రన్‌ను విజయవవంతంగా నిర్వహించారు. చినాబ్‌ వంతెన దాటడంతో పాటు సంగల్డన్‌ నుంచి రియాసీ వరకు ఓ రైలు ఇంజిన్‌ను నడిపిన వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

అత్యంత ఎత్తైన బ్రిడ్జి...

కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌-శ్రీనగర్‌- బారాముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెనను నిర్మించారు. ఇది అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. దీని ఎత్తు 30 కంటే ఎక్కువ. నదీ లోతు నుంచి 359 మీటర్ల ఎత్తున్న దీని పొడవు 1315 మీటర్లు. ఇప్పటివరకు చైనాలో ఉన్న 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన కన్నా ఇది పెద్దదిగా పరఖ్యాతి గాంచింది.

వంతెన నిర్మాణంలో భాగంగా కొన్ని టన్నెళ్ళను కూడా నిర్మించారు. ఇక మీదట నుంచి ఈ వంతెన మీద రైలు ప్రయాణం, టన్నెల్స్ అనుభూతి అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. భారత్‌లో చూడవలసిన ప్రదేశాల్లో చీనాబ్ వంతెన ఒకటిగా చేరుతుందని ఇంజనీర్లు, అధికారులు చెబుతున్నారు.

Also Read:Andhra Pradesh: ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్..

Advertisment
Advertisment
తాజా కథనాలు