Darjeeling : ఆ రూట్‌లో మళ్లీ రైళ్ల రాకపోకలు ప్రారంభం!

పశ్చిమబెంగాల్‌లోని డార్జింగ్‌లో సోమవారం ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న సంఘటన గురించి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా , 41 మంది గాయపడ్డారు.ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలను సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించి రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు.

New Update
Darjeeling : ఆ రూట్‌లో మళ్లీ రైళ్ల రాకపోకలు ప్రారంభం!

Train Services Started : పశ్చిమబెంగాల్‌ (West Bengal) లోని డార్జింగ్‌ (Darjeeling) లో సోమవారం ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న సంఘటన గురించి తెలిసిందే. సోమవారం ఉదయం త్రిపురలోని అగర్తలా నుంచి కోల్‌కతాలోని సీల్దాకు వెళ్తున్న కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Kanchanjunga Express Train) ను న్యూ జల్‌పాయ్‌గురి రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని రంగపాని స్టేషన్‌ సమీపంలో అదే ట్రాక్‌పై వెనుక నుంచి వచ్చిన ఒక గూడ్స్‌ రైలు ఢీకొట్టింది.

ప్రమాదం ధాటికి ఎక్స్‌ప్రెస్‌ రైలులోని నాలుగు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గూడ్సు బోగీలు కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా , 41 మంది గాయపడ్డారు. ఇదంతా 24 గంటల క్రితం జరిగిన సంగతి. ప్రస్తుతం ఆ రూట్‌లో యధావిధిగా రైళ్లు మళ్లీ తిరుగుతున్నాయి. ప్రమాదం అనంతరం ఫన్సిడేవా వద్ద రైల్వే ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలను సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించి పనులు మొదలు పెట్టారు. విద్యుత్‌ లైన్లను బాగుచేశారు. అనంతరం రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు.

Also read: విమానం గాల్లో ఉండగా మంటలు..భయాందోళనలో ప్రయాణికులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు