BIG BREAKING : నాంపల్లిలో రైలు ప్రమాదం.. 50 మందికి గాయాలు

హైదరాబాద్ నాంపల్లిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం చార్మినర్ ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టడంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో ప్రయాణిస్తున్న 50 మంది గాయపడ్డారు. మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.

New Update
BIG BREAKING : నాంపల్లిలో రైలు ప్రమాదం.. 50 మందికి గాయాలు

Hyderabad : హైదరాబాద్ నాంపల్లిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం చార్మినర్ ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టడంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో ప్రయాణిస్తున్న 50 మంది గాయపడ్డారు. పోలీసులు, రైల్వే సిబ్బంది సహాయక చర్చలు చేపట్టారు. క్షతగాత్రులను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరించారు.

publive-image

లోకో పైలట్‌ తప్పిదమే..
ఇక రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎస్‌ 2, ఎస్‌ 3, ఎస్‌ 6 బోగీలు దెబ్బతినగా.. 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యానని చెప్పారు. లోకో పైలట్‌ తప్పిదమే ఇందుకు కారణమని, అనుమానిస్తున్న స్టేషన్‌కు చేరుకునేందుకు రైలు నెమ్మదిగా కదలడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే భారీ ప్రాణ నష్టం వాటిల్లేదన్నారు.

publive-image

కుదుపులతో భారీ శబ్ధం.. 
ఈ ప్రమాదం జరిగినప్పుడు భారీ శబ్ధం వచ్చింది, రైలు కుదుపులకు గురికావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్లు ప్రయాణికులు తెలిపారు. రైలు దిగేందుకు డోర్ దగ్గర నిలబడ్డ ప్రయాణికులు ఫ్లాట్ ఫాట్ పై పడిపోయారని, స్టేషన్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి వారిని కాపాడినట్లు చెప్పారు.  అలాగే చిన్న చిన్న గాయలతో బయటపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించామని, సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

publive-image

పొన్నం ప్రభాకర్‌ విచారం..
ఈ ప్రమాదంపై విచారణ వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు