Visakha: కంచరపాలెంలో విషాదం..చున్నీ మెడకు బిగుసుకొని ఊపిరాడక బాలుడు మృతి

విశాఖ కంచరపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చున్నీ మెడకు బిగుసుకొని ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లో ఓ పైపుకు, తన మెడకు చున్నీ కట్టి విన్యాసాలు చేసిన బాలుడు. వీడియోగేమ్స్‌లో మాదిరిగా ఫీట్స్‌ చేస్తుండగా ఘటన జరిగింది. వీడియోగేమ్స్‌కు అలవాటుపడిన 8ఏళ్ల బాలుడు డింపుల్‌ సూర్య. బాలుడి మృతితో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.

New Update

విశాఖలో ఎనిమిదేళ్ల బాలుడి మృతి కలకలం రేపుతోంది. 8ఏళ్ల బాలుడు డింపుల్ సూర్య చున్నీతో ఆడుకుంటూ మెడకు బిగుసుకొని ఊపిరాడక మృతి చెందాడు. కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇంటి వరండాలో బాలుడు చున్నీకి వేలాడుతూ కనిపించడాన్ని గమనించిన స్థానికులు..ఇంట్లో ఉన్న తల్లికి విషయం చెప్పారు. ఐతే అప్పటికే బాలుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కైలాసపురం కస్తూరి నగర్‌కు చెందిన పైడ శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు సూర్యకు ఎనిమిదేళ్లు. ఓ ప్రైవేట్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. ఐతే వీడియో గేమ్స్‌కు అలవాటు పడ్డ బాలుడు..ఆటల్లో మాదిరిగా సాహసాలు చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో వరండాలో ఓ ప్లాస్టిక్ పైపుకి చున్నీ కట్టి మరో పక్క మెడకు చుట్టుకుని తిరుగుతూ ఆటలు ఆడుతుండగా..ఈ ప్రమాదం జరిగింది.

తండ్రి శ్రీనివాసరావు పనికి వెళ్లిపోగా తల్లి శ్రీలక్ష్మి ఇంట్లో ఏదో పని చేసుకుంటోంది. ఇంటి వరండాలో ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఐతే బాలుడు మెట్ల పక్కన చున్నీకి వేలాడుతుండడం చూసిన స్థానికులు..భయంతో పెద్దగా కేకలు వేసి బాలుడిని కిందికి దింపారు. ఐతే అప్పటికే అతను మృతి చెందాడు. అయితే ఎనిమిదేళ్ల బాలుడు ఇలా ఎలా చేసుకుంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు