Krishna Bridge: ఆ రూట్లో వెళ్లేవారికి అలర్ట్.. 45 రోజుల పాటు కృష్ణా బ్రిడ్జ్ బంద్! కృష్ణా బ్రిడ్జి మీద 45 రోజుల పాటు మరమతులు సాగుతుండడంతో అటు వైపు వెళ్లే వాహనాదారులు అప్రమత్తం అవ్వాలని సూచించారు.జనవరి 17 నుంచి 45 రోజుల పాటు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు రాయచూర్ కలెక్టర్ తెలిపారు. By Bhavana 17 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Krishna Bridge: నారాయణపేట జిల్లా కృష్ణా బ్రిడ్జి పై 45 రోజుల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వంతెన మీదగా వెళ్తున్న జాతీయ రహదారి 167 ను మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు వివరించారు. దీంతో జనవరి 17 నుంచి 45 రోజుల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు రాయచూర్ కలెక్టర్ తెలిపారు. దారి మళ్లింపు.. కర్ణాటక లోని రాయచూర్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే వాహనదారులు ఈ విషయం గమనించి ఆంక్షలు పాటించాలని కోరారు. ఆ రూట్ లో వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్లాలి అనుకునే వారు మరికల్ సబ్ స్టేషన్ నుంచి చిత్తనూరు, అమరచింత జూరాల డ్యామ్, గద్వాల్ మీదుగా కేటీదొడ్డి రాయిచూర్ మీదుగా దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఫ్లెక్సీలు ఏర్పాటు.. ప్రయాణికులకు రూట్ల గురించి తెలియజేసేందుకు అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పాత రోడ్డు ఉన్నప్పుడు ప్రయాణం బాగానే సాగిందని కొత్త సీసీ రోడ్లు వేసినప్పటి నుంచి కూడా ఈ సమస్య ఎక్కువైందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పుడు మళ్లీ 45 రోజుల పాటు బ్రిడ్జి పై వాహనాలను నిలిపివేసి మరమ్మత్తులు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వంతెన.. ఇప్పటికైనా కాంట్రాక్టర్లు నాణ్యమైన రోడ్డు వేయాలని కోరారు. కర్నాటక నుంచి హైదరాబాద్ మధ్య వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత వంతెనకు మరమ్మతులు చేయడంతో పాటు కొత్త వంతెన కూడా నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. 2016 లో ఈ వంతెనకు మరమ్మతులు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడి వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. గుంతలో ఏదైనా వాహనం నిలిచిపోతే భారీగా ట్రాఫిక్ కూడా నిలిచిపోతుంది. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసులకు ట్రాఫిక్ క్లియర్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నిసార్లు అధికారులు బ్రిడ్జికి మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ కొద్ది రోజులకే గుంతలు పడి పోతున్నాయి. Also read: గంటన్నరకు పైగా టాయిలెట్ లోనే.. డోర్ లాక్ అవ్వడంతో జర్నీ మొత్తం అందులోనే! #telangana #hyderabad #karnataka #rayachur #krishna-bridge #repairs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి