Alert: మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

నగరంలోని మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాపోకలు నిలిపివేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో ముసీ ప్రవాహం అధికమైంది. మూసీ వరద మూసారంబాగ్‌ బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపై రాకపోకులను నిలిపివేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

New Update
Alert:  మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

నగరంలోని మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాపోకలు నిలిపివేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో ముసీ ప్రవాహం అధికమైంది. మూసీ వరద మూసారంబాగ్‌ బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపై రాకపోకులను నిలిపివేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అర్థరాత్రి తర్వాత మూసి నది ప్రవాహం మూసారాంబాగ్‌ బ్రిడ్జి పైన నుంచి వెళ్లే అవకాశం ఉందన్నారు. దీంతో బ్రిడ్జికి విరువైపులా భారీ గెట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుదవారం మూసీ ఉధృతిని బట్టి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రాకపోకలకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై క్లారిటీ ఇస్తామని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ తెలిపారు

మరోవైపు హైదరాబాద్‌లో వర్షం దంచ్చి కోట్టింది. అసలు ఎక్కడా తగ్గలేదు.. కాస్త తగ్గిందని అలా బయటకు వచ్చామా.. సెకెన్ల వ్యవధిలో మళ్లి దంచికొడుతున్నాడు వరుణుడు. ఇదేం వర్షంరా బాబు అని ప్రజలు తలలు కొట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కూడా కొంతమంది తమ పిల్లలను స్కూల్స్‌కి పంపించి అక్కడ హాలీడే అని తెలుసుకోని రిటర్న్ అవుతున్నారు. ఇంత వర్షంలో స్కూల్‌కి పంపడం అవసరమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేక్ పేట ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఇక హైదరాబాద్‌ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

నగరంలోని అనేక బస్తీల్లో వర్షం కారణంగా ఇబ్బందులు పెరిగిపోయాయి. పలు బస్తీల్లో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. లింగంపల్లి అండర్‌పాస్‌ వద్ద భారీగా వర్షం నీళ్లు నిలిచాయి. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో నాలా పొంగి వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల కురుస్తున్న పరిస్థితుల్లో జనం అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు గేట్లు ద్వారా ముసిలోకి 442 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. అటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి బాలాజీ నగర్ కాలనీలో భారీ వర్షం పడడంతో ఇళ్లల్లోకి వరద నీరు చేరుకుంటోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వరద నీరు తొలగించాలని నార్సింగి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. అయినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు