T-Congress Politics : వీహెచ్ కు టీపీసీసీ షాక్.. అలా చేస్తే వేటే అంటూ వార్నింగ్! పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ షాకిచ్చారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల వీహెచ్ సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. By Nikhil 25 Mar 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Mahesh Kumar Goud : టీపీసీసీ(TPCC) వర్కింగ్ ప్రసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తాజాగా కీలక ప్రకటన చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి షాక్ ఇచ్చారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలను అంతర్గతంగా తెలియజేయాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ఎవరు మాట్లాడినా.. ఎంత సీనియర్ అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. Also Read : నకిరేకల్ లో హోళీ సంబరాలు.. ఎమ్మెల్యే వేముల మాస్ డ్యాన్స్ వీహెచ్ కు వార్నింగ్.. ఇటీవల పార్టీ సీనియర్ నేత వీహెచ్ గాంధీభవన్(Gandhi Bhavan) లో ప్రెస్ మీట్ పెట్టి పీసీసీ చీఫ్, సీఎం రేవంత్(CM Revanth) పై తీవ్ర విమర్శలు చేశారు. ఇతర పార్టీల నేతల నివాసాలకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడాన్ని తప్పు పట్టారు. సీఎం స్థాయి తగ్గించుకోకంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ తాజాగా వార్నింగ్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. దీంతో వీహెచ్ ఈ వార్నింగ్ పై ఎలా రియాక్ట్ అవుతారనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. #cm-revanth-reddy #v-hanumantha-rao #tpcc #mahesh-kumar-goud మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి