Telangana: కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే!?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇవాళో, రేపో బీఆర్ఎస్ లో చేరుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

New Update
Telangana: కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే!?

Thati Venkateswarlu: తెలంగాణలో కాంగ్రెస్(Congress) పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. టీపీసీసీ జనరల్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్(BRS) పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అశ్వారావుపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు తాటి వెంకటేశ్వర్లు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే, తాటి వెంకటేశ్వర్లుతో మంత్రి హరీష్ రావు టచ్‌లోకి వెళ్లారు. వెంకటేశ్వర్లుతో మంతనాలు జరిపారు హరీష్ రావు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం లోగా సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు తాటి వెంకటేశ్వర్లు. 2014లో అశ్వారావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తాటి వెంకటేశ్వర్లు.. ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆయన బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు. ఆ తరువాత తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌లో చేరారు.

Also Read:

వెండితెర లోకనాయకుడు..నటనకు ప్రాణం పోసే కమల్ హసన్ బర్త్ డే టుడే.

ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు డాక్టర్ ఇంతియాజ్ అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Khushdil Shah: చిర్రెత్తిపోయిన చిన్నోడు.. అభిమానులను కొట్టబోయిన పాక్ క్రికెటర్ - వీడియో చూశారా?

న్యూజిలాండ్‌తో 3వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ 0-3 తేడాతో ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్ తర్వాత పాక్ క్రికెటర్ ఖుష్దిల్ షా ప్రేక్షకులను కొట్టడానికి దూసుకెళ్లాడు. ఆఫ్ఘన్ అభిమానులు పాక్ క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించడంతో అతడు అలా చేసినట్లు తెలుస్తోంది.

New Update
Pakistan Cricketer Khushdil Shah Attacks Fans During NZ ODI

Pakistan Cricketer Khushdil Shah Attacks Fans During NZ ODI

పాకిస్థాన్ క్రికెటర్ ఖుష్దిల్ షా వార్తల్లో నిలిచాడు. అతడు తన అనుచిత ప్రవర్తన ద్వారా విమర్శలకు గురయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ఖుష్దిల్ షా ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లడంతో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకీ ఏం జరిగింది?.. ఎందుకు ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లాడు? అనే విషయానికొస్తే.. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

న్యూజిలాండ్ vs పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌‌లో భాగంగా న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ 0-3 తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. మొదటిగా రెండు వన్డేలు ఓడిపోయిన పాకిస్థాన్ శనివారం (ఏప్రిల్ 5) జరిగిన మూడో వన్డేలో సైతం కుప్పకూలిపోయింది. ఈ చివరి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌పై పాక్ 43 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో పాక్ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

దానికి తోడు ఇటీవలే టీ20 సిరీస్‌ను సైతం పాకిస్థాన్ కోల్పోయింది. 1-4 తేడాతో ఓటమిపాలైంది. అప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న పాకిస్థాన్‌కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో పాక్ క్రికెటర్లు ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఇదే క్రమంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆల్‌రౌండర్ క్రికెటర్ ఖుష్దిల్ షా అనుచిత ప్రవర్తన వైరల్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ప్రేక్షకులపై దాడికి యత్నం

ఈ మ్యాచ్ జరిగిన తర్వాత ఖుష్దిల్ షా క్రికెట్ అభిమానుల మీదకు దూసుకెళ్లాడు. అందుకు ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ తర్వాత కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్రియులు పాక్ క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దానిని ఆపమని ఖుష్దిల్ షా వారిని కోరినా.. వారు దుర్భాషలాడుతూనే ఉండటంతో అతడు ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లినట్లు సమాచారం. అప్పటికే సిరీస్ టీ20 సిరీస్‌ను కోల్పోయిన పాక్.. ఇప్పుడు వన్డే సిరీస్‌ క్లీన్ స్వీప్ కావడంతో విలవిల్లాడిపోయిందని అందుకే ఖుష్దిల్ క్రూరంగా ప్రవర్తించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

పీసీబీ స్పందన 

దీనిపై పీసీబీ స్పందించింది. ‘‘జాతీయ ఆటగాళ్లను ఉద్దేశించి విదేశీ ప్రేక్షకులు దుర్భాషలాడడాన్ని పాకిస్తాన్ క్రికెట్ జట్టు యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈరోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలో, మైదానంలో ఉన్న క్రికెటర్లపై విదేశీ ప్రేక్షకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు" అని పిసిబి తెలిపింది. 

(latest-telugu-news | telugu-news | pcb | Khushdil Shah | NZ vs Pak)

Advertisment
Advertisment
Advertisment