UP: కాన్పూర్ లో స్కూటర్లలో పేలుడు..పలువురికి గాయాలు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో మర్కజ్ మసీదు దగ్గరలో ఈరోజు సాయంత్రం పేలుళ్ళు సంభవించాయి. పార్క్ చేసి ఉన్న స్కూటర్లలో పేలుళ్ళు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో మర్కజ్ మసీదు దగ్గరలో ఈరోజు సాయంత్రం పేలుళ్ళు సంభవించాయి. పార్క్ చేసి ఉన్న స్కూటర్లలో పేలుళ్ళు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధ విరమణకు జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు పడినట్టు తెలుస్తోంది. విడుదల కావాల్సిన బందీలు, ఖైదీల పేర్లు ఉన్న జాబితాలను ఇజ్రాయెల్- హమాస్ మార్పిడి చేసుకున్నాయి.
స్టాక్ మార్కెట్ లో లాభాలు పొందాలనుకుంటున్నారా అయితే ఐదు స్టాక్స్ కచ్చితంగా కొనండి అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. GHCL, మారికో, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ఇండిగో వీటిల్లో పెట్టుబడి పెడితే ఆదాయం పక్కా అని అంటున్నారు.
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. కరూర్ ర్యాలీ బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాంటూ అందులో విజ్ఞప్తి చేశారు. కరూర్ రోడ్ షోలో 41 మంది మృతి చెందారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుఫున పోరాడుతున్న భారతీయుడు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ ను ఉక్రెయిన్ దళాలు పట్టుకున్నాయి. ఈ విషయాన్ని నిర్థారించడానికి ప్రయత్నిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
2027 వరల్డ్ కప్ ఆడటమే తన లక్ష్యమని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో సారి స్పష్టం చేశాడు. తాను కెప్టెన్ గా లేకపోయినా పట్టించుకోనని..జట్టు గెలవడమే తనకు ముఖ్యమని అన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సీరీస్ సవాల్ తో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
హెచ్ 1బీ వీసాదారులు ఇప్పుడు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అంటోంది కాలిఫోర్నియా యూనివర్శిటీ. వీసా రూల్స్ పై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో హెచ్ 1బీ వీసాల మీద ఉన్న అధ్యాపకులు, సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించింది.
భారత్, పాకిస్తాన్ మధ్య శాంతికి మీరే కారణం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కెనడా ప్రధాని కార్నీ ప్రశంసించారు. ఒక వైపు ఎడతెగని సుంకాల మోత, మరోవైపు నోబెల్ బహుమతుల ప్రకటన...ఈ నేపథ్యంలో కార్నీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.