/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-9-5-jpg.webp)
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్(IPL 17 Season) లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా బిగ్ మ్యాచ్ జరగనుంది. గురువారం ఏప్రిల్ 25న RCB Vs SRH తలపడనున్నాయి. ఈ సీజన్ లో దారుణంగా విఫలమైన బెంగళూర్ జట్టు 8 మ్యాచ్ ల్లో కేవలం 1 మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో ఉంది. మరో వైపు SRH వరుస విజయాలతో దూసుకెళ్తోంది. దీంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
కోహ్లీ.. కోహ్లీ.. అంటూ నినాదాలు..
ఇదిలావుంటే.. నేడు జరగబోయే మ్యాచ్ లో భాగంగా హైదరాబాద్(Hyderabad) చేరుకున్నాయి ఇరుజట్లు. అయితే నిన్న సాయంత్రం ప్రాక్టీసులో భాగంగా స్టేడియానికి కోహ్లీ రాబోతున్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోహ్లీ వచ్చిన సమయంలో అభిమానులంతా కోహ్లీ.. కోహ్లీ.. అంటూ నినాదాలు చేయడంతో స్టేడియం చుట్టుపక్కలా కోహ్లీ నామస్మరణతో మార్మోగింది. కోహ్లీకి ఉప్పల్ స్టేడియంలో మంచి రికార్డ్ ఉండగా.. నేటి మ్యాచ్ లో భారీ స్కోర్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
ఇది కూడా చదవండి: Dasari sahithi: ఎంపీగా పోటీ చేస్తున్న తెలుగు నటి.. నామినేషన్ దాఖలు!
The Roar for Virat Kohli when he's going for practice session at Hyderabad today. 🔥🐐#ViratKohli #SRHvRCB #SRHvsRCB #IPL #IPL2024 #Cricket
— The Cricket TV (@thecrickettvX) April 24, 2024
భారీ బందోబస్తు ఏర్పాటు..
ఇక మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) ఆంక్షలు విధించారు. స్టేడియంలో 2500 మందితో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం అర్థరాత్రి వరకూ ఆర్టీసీ, మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులను నడపబోతున్నాయి. ఇక సీజన్ లో హైదరాబాద్ వేదికగా మరో 4 మ్యాచ్ లు జరగనున్నాయి. మే 2న హైదరాబాద్- రాజస్థాన్, మే 8న హైదరాబాద్- లక్నో, మే 16న హైదరాబాద్- గుజరాత్, మే 19న హైదరాబాద్- పంజాబ్ మధ్య జరగనున్నాయి.