Tomato Soup Recipe : ఈ టొమాటో సూఫ్ యమ టెస్టీ గురూ! టొమాటో, టోఫు సూప్ చలికలంలో మంచి ఉత్తమమైన రెసిపి. పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో ఈ సూప్‌ను వేడివేడిగా చేసుకోని తాగితే ఎంతో టెస్టిగా ఉంటుంది. ఈ సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 22 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Tomato Soup : చలికాలంలో చాలామంది వేడిగా తినడానికి, త్రాగడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఉదయాన్నే వేడిగా ఏదైనా తీసుకుంటే..రోజంతా రిఫ్రెష్‌గా ఉంటారని కొందరూ అనుకుంటారు. అల్పాహారం కోసం పోహా-చీలా(Poha-Chilla), ఖిచ్డీ, గంజిని తయారు చేసి అలసిపోతే.. తప్పనిసరిగా టొమాటో, టోఫు సూప్(Tomato Soup) ని ప్రయత్నించి చూడండి. టొమాటో, టోఫుతో తయారు చేసిన సూప్ తాగిన తర్వాత హృదయం సంతోషంగా ఉంటుంది. టొమాటో, టోఫు సూప్ చలికలంలో మంచి ఉత్తమమైన రెసిపి. టొమాటో సూప్‌తో టోఫు కలపడం కంటే ఎక్కువ ప్రయోజనం ఏమీ ఉండదు. దీని రుచి మసాలాగా ఉంటుంది. అందుకే పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు. ఈ టమోటా, టోఫు సూప్ చేయడానికి చాలా సులభం. ఇప్పుడు ఈ రుచికమైన సూప్‌కి అవసరమైన పదార్థాలను, ఎలా తయారు చెయాలో ఇప్పుడు చుద్దాం. టొమాటో-టోఫు సూప్ కావల్సిన పదార్థాలు: పెద్ద సైజు టమోటాలు నాలుగు 100 గ్రాములు సోయాబీన్ టోఫు రెండు కప్పులు తరిగిన కూరగాయలు ఉల్లిపాయలు సన్నగా తరిగిన కప్పు తాజా పుట్టగొడుగులు టీస్పూన్ చింతపండు పేస్ట్ టీస్పూన్ కూరగాయల నూనె 1/2 కప్పు తరిగిన వెల్లుల్లి 1/2 టీస్పూన్ కొత్తిమీర ఆకులు 1/2 టీస్పూన్ చక్కెర టీస్పూన్ టొమాటో కెచప్ సూప్ రుచికి సరపడ ఉప్పు సూప్ తయారీ విధానం ముందుగా టొమాటోలను క్వార్టర్స్‌గా, టోఫును క్యూబ్‌లుగా కట్ చేయాలి. తరువాత పుట్టగొడుగు(Mushroom) లను శుభ్రం చేసుకుని కట్ చేసుకోవాలి. ఉల్లిపాయను సన్నగా కోయాలి. ఒక గిన్నే తీసుకుని అందులో కూరగాయలు వేసి మీడియం మంట మీద మరిగించాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో టోఫు వేసి 2 నిమిషాలు ఉడకనివ్వండి. తరువాత మరో పాన్ స్టావ్ మీ పెట్టి మీడియం మంట మీద వేడి కాగానే నూనె వేడి చేయాలి. బాణలిలో ఉల్లిపాయ వేసి కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు పాన్‌లో పంచదార, టొమాటో వేసి మరో 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అన్ని పదార్థాలను కలుపుకోవలి. అందులో ఉల్లిపాయ మిశ్రమాన్ని మష్రూమ్ , టొమాటో సాస్ కలపుకోవాలి. ఉడకబెట్టి ఈ మిశ్రమంలో చింతపండు పేస్ట్ వేసి కాసేపు కలుపుతూ ఉండాలి. అందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే రుచికరమైన టమోటా, టోఫు సూప్ సిద్ధం అవుతుంది.చివరిలో మీరు కొత్తిమీర , వెల్లుల్లి వేసి సర్వ్ చేయవచ్చు. ఇలా చేస్తే రుచి అందరికీ నచ్చుతుంది. ఇది కూడా చదవండి: శీతాకాలంలో నవజాత శిశువుకు ప్రత్యేక శ్రద్ధ వహించండి.. ఇలా చేయండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #health-benefits #winter #mushroom #tomato-soup-recipe మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి