Tomato Prices : మరోసారి భారీగా పెరిగిన టమాటా ధర.. కిలో ఎంతంటే! పెరుగుతున్న నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు కూడా వచ్చి చేరుతున్నాయి.ప్రస్తుతం కిలో టామాటా రూ.60-70కి చేరింది. మార్కెట్లలో అయితే ఏకంగా రూ.100కు కూడా అమ్ముతున్నారు. By Bhavana 24 Jul 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Tomato Prices Hikes : భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు ఇప్పటికే అల్లాడిపోతున్నారు. మధ్యతరగతి వారైతే.. తమ చాలీచాలనీ జీతాలతో సంసారాలు ఈదుతున్న వారు పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్నారు. ఈ సమయంలో నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు (Vegetables) కూడా వచ్చి చేరుతున్నాయి. గత కొంతకాలంగా కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు. కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన టమాట ధరలు (Tomato Prices).. మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని రోజుల క్రితం టామాటా ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కిలో టామాటా ధర రూ.80 నుంచి రూ.100 వరకు వెళ్లింది. టామాటా ధర ఇటీవలి కాస్త తగ్గు ముఖం పట్టినట్లే పట్టి మళ్లీ పెరిగింది. హైదరాబాద్ (Hyderabad) మార్కెట్‌లో కిలో రూ.40-50కి వచ్చింది. టామాటా ధర తగ్గిందని సామాన్యులు సంతోషించే లోపే మరోసారి పెద్ద షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం కిలో టామాటా రూ.60-70కి చేరింది. మార్కెట్లలో అయితే ఏకంగా రూ.100కు కూడా అమ్ముతున్నారు. కిలో రూ.50 ఉంటే రూ.70కి అమ్ముతున్నారని అడిగితే.. పుచ్చులు, మచ్చలున్న టమాటాలు తీసుకోండి అని అంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also read: అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి #hyderabad #tomato-prices #vegetables మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి