/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-24T155641.879-jpg.webp)
Samantha : 2024 లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ పుష్ప 2(Pushpa 2). అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన 'పుష్ప రాజ్' ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసేసింది. పార్ట్ 1 సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Also Read : Ketika Sharma: బీచ్ అందాలతో పోటీపడుతున్న హాట్ బ్యూటీ కేతిక.. వైరలవుతున్న ఫొటోలు..!
'పుష్ప 2' లో సమంత అతిథి పాత్ర
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది. పుష్ప 2 లో టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోయిన్ సమంత(Samantha) అతిథి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోందో. ఇక పుష్ప పార్ట్ 1 'Oo Antava Mava' స్పెషల్ సాంగ్ తో కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టిన సామ్.. ఇప్పుడు పార్ట్ 2 లో మెరవనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే ఫ్యాన్స్ కు పండగే అంటున్నారు నెటిజన్లు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
భారీ యాక్షన్ సన్నివేశాలు, హాయ్ టెక్నికల్ స్టాండర్డ్స్ తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన(Rashmika Mandanna) కథానాయికగా నటిస్తున్నారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాసిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు.
Also Read : Actress Anjali: విడాకులు తీసుకున్న నిర్మాతతో.. హీరోయిన్ అంజలి పెళ్లి?