World Polio Day 2023:నేడు ప్రపంచ పోలియో దినోత్సవం పోలియో ఒకప్పుడు ఇదో పెద్ద మహమ్మారి. దీని బారిన పడి చాలా మంది పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అయిపోయాయి. గర్భధారణ సమయంలో లేదా పిల్లలకు ఈ వ్యాధి సోకుతుంది.పోలియో పోలియోమైలిటిస్ లేదా పోలియో వైరస్ వల్ల కలిగే వ్యాధి. దీనినే శిశువు పక్షవాతం అని కూడా అంటారు.ప్రమాదకరమైన అంటువ్యాధిగా పరిగణించే పోలియో నేరుగా నాడీ మండలంపైనే దాడి చేస్తుంది. దీన్ని అరికట్టడానికి..పోలియో టీకాల మీద అవగాహన పెంచడానికి అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. By Manogna alamuru 24 Oct 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి World Polio Day 2023: నేడు,అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి గుర్తించిన ప్రపంచ పోలియో దినోత్సవం. పోలియో అనే పదం పోలియోమైలిటిస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. పోలియో అంటే బూడిద.'మైలోన్' అంటే మజ్జ. ఎముక మజ్జలో ఈ వ్యాధి మొదలవుతుంది కాబట్టి దీనిని పోలియోవైరస్ లేదా పోలియోమైలిటిస్. వెన్నెముక్క, మెదడు కాండంలోని నరాలపై దీని ప్రభావం ఉంటుంది. వ్యాధి బారిన పడిన వ్యక్తి అవయవాలను కదపలేక పోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం,కొన్నిసార్లు ఇది తీవ్ర స్థాయికి చేరి మరణానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. పోలియోమైలిటిస్ ముదిరితే పక్షవాతం అవుతుంది. ఇది ఒక ప్రాణాంతక అంటువ్యాధి. వయసుతో నిమిత్తం లేదు. అయితే ఎక్కువగా చిన్న పిల్లలపై దీని ప్రభావం ఉంటుంది. పోలియోకు కారణమైన వైరస్ పికోర్నావిరిడే కుటుంబం.. ఎంటెరోవైరస్ జాతికి చెందినది. పోలియో వైరస్ (Polio Virus) నేరుగా నాడీవ్యవస్థపై దాడి చేస్తుంది. అందువలన ఈ వ్యాధి సోకిన తరువాత తగ్గే అవకాశం లేదు. అయితే పోలియో సోకిన అందరికీ ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఏర్పడదు. ఒకే రకమైన లక్షణాలూ కనిపించవు. ఈ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం అబార్టివ్ పోలియో మైలిటిస్ (Abortive poliomyelitis).. రెండవ రకం పెరాలిటిక్ పోలియోమైలిటిస్ (Paralytic poliomyelitis). Also Read:కోమటిరెడ్డి ప్లేస్ లో బూర నర్సయ్య..రంగంలోకి దిగిన బీజేపీ అధిష్టానం అబార్టివ్ పోలియోమైలిటిస్.. జ్వరం, అలసట, వికారం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, దగ్గు, మెడ పట్టడం, శరీరంలో అన్ని భాగాలూ నొప్పికి గురవడం ఇలాంటి సాధారణ లక్షణాలతో బాధిస్తుంది. కానీ ఇది మందులతో నయమవుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపదు. పెరాలిటిక్ పోలియోమైలిటిస్.. ఇది చాలా క్లిష్టమైనది. నేరుగా నాడీ వ్యవస్థపైనే దాడి చేస్తుంది. శ్వాసకోశ కండరాలపై ప్రభావం చూపడం, మెదడు ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం లాంటి పరిస్థితుల్లో శాశ్వతంగా ఆ కండరాలు పని చేయకుండా చేస్తుంది. ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. తేకాదు.. ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా కూడా పోలియో వైరస్ సోకే ప్రమాదం ఉంది కొందరిలో. అలాంటి సందర్భాల్లో శాశ్వత వైకల్యానికి గురికావలసి వస్తోంది. పోలియో వైరస్ పిల్లల పేగులపై ప్రభావం చూపుతుంది. పిల్లలందరికీ ఒకే రోజు పోలియో టీకాను వేస్తారు. ఇది అందరి పిల్లలకు వర్తిస్తుంది. వ్యాధికారక వైరస్‌లను నాశనం చేస్తుంది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ నుంచి పోలియో ఇతర దేశాలకు వైరస్ వ్యాప్తి దృష్ట్యా భారత్ పోలియో నిర్మూలన కార్యక్రమం ఇప్పటికీ కొనసాగిస్తుంది. భారత్లో 2005లో 66, 2006లో 676, 2007లో 874, 2008లో 559, 2009లో 741, 2010లో 42, 2011లో 1 కేసులు నమోదయ్యాయి. చివరిగా 2011 జనవరి 13న రెండేళ్ల బాలికకు ఈ వ్యాధి వచ్చింది. పోలియో వ్యాక్సిన్‌ను జోనాస్ సాల్క్ (Jonas Salk) 1952లో కనుగొన్నారు. కానీ ఆనయన దీనిని 1955 ఏప్రిల్ 12 ప్రకటించారు. ఆతర్వాత నుంచి అమల్లోకి తెచ్చారు. ఇది ఒక టీకా. ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేది. జోనాస్ తర్వాత ఆట్బర్ట్ సబైన్ (Albert Sabin) నోటి టీకాను కనుగొన్నారు. 1957లో ఈ నోటి టీకాను మానవుల మీద ప్రయోగించేందుకు అనుమతి లభించింది. ఇది 1962లో లైసెన్స్ పొందింది. అప్పటి నుంచి దీనిని ఇప్పటి వరకు పిల్లలకు ఇస్తూనే ఉన్నారు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఐదేళ్ళు వచ్చేవరకు ఈ నోటి టీకాను ఇస్తారు. ప్రాణాంతక, నివారణలేని వ్యాధికి మందు కనిపెట్టిన జోనాస్ సాల్క్ పుట్టినరోజు సందర్భంగానే అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకోవాలని డబ్ల్యుహెచ్‌ఒ (WHO), గ్లోబల్ కమ్యూనిటీ కలసి నిర్ణయించాయి. #world #vaccine #october #day #polio మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి