Pak vs SA: సెమీస్ రేస్ ఒత్తిడిలో పాక్.. అగ్రస్థానం కోసం తలపడుతున్న సౌత్ ఆఫ్రికా

వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్, దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాక్ జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు భారీ విజయాలతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా అగ్రస్థానం కోసం పోటీ పడుతోంది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

New Update
Pak vs SA: సెమీస్ రేస్ ఒత్తిడిలో పాక్.. అగ్రస్థానం కోసం తలపడుతున్న సౌత్ ఆఫ్రికా

Pak vs SA World Cup 2023: వన్డే ప్రపంచ కప్ లో ఈరోజు కీలక మ్యాచ్ జరుగుతోంది. సెమీస్ కోసం పరుగులు పెడుతున్న పాకిస్తాన్ (Pakistan) ఒకవైపు... టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్న సౌత్ ఆఫ్రికా (South Africa) మరోవైపు. ఈ మ్యాచ్ లో ఎలా అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది పాక్ టీమ్. మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండాలనుకుంటోంది సౌత్ ఆఫ్రికా. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకంగా మారింది. పాక్ కనుక దీనిలో ఓడిపోతే దాదాపు సెమీస్ రేస్ నుంచి తప్పుకున్నట్లే అవుతుంది. పైగా లాస్ట్ మ్యాచ్ లో ఆఫ్ఘాన్ చేతిలో ఓడిపోయి తీవ్రంగా విమర్శలు పాలయ్యింది పాక్ టీమ్. దాని నుంచి బయటపడాలంటే అయినా ఈరోజు మ్యాచ్ ను గెలిచి తీరాలి.

మరోవైపు దక్షిణా ఆఫ్రికా ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడింది. అందులో నాలుగింట్లో భారీ విజయాలను నమోదు చేసుకుంది. అయితే పసికూన నెదర్లాండ్స్ చేతిలో మాత్రం ఓటమి పాలయ్యింది. కానీ టీమ్ పరంగా చాలా బలంగా ఉంది సౌత్ ఆఫ్రికా. ఇలాంటి టీమ్ ను ఎదుర్కోవడం అంటే ఏ జట్టుకు అయినా ఓ సవాల్ లాంటిదే. పాక్ కు కూడా ఇది అంత తేలికైన విషయం కాదు.

Also Read: ఆసియా పారా గేమ్స్ లో అర్చర్ శీతల్ అద్భుత ప్రదర్శన.. గోల్డ్ మెడల్ కైవసం

ఇక వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా (Pak vs SA in World Cups) మూడు సార్లు మాత్రమే తలపడ్డాయి. మూడుసార్లలో ఒక్కసారి మాత్రమే సౌత్ ఆఫ్రికా గెలిచింది. అది కూడా 24 ఏళ్ళ కిందట 1999 వరల్డ్ కప్ లో. తర్వాత 2015, 2019లో ఆ జట్టు పాక్ చేతిలో ఓడిపోయింది. మరి ఇప్పుడు దానికి ప్రతీకారం సౌత్ ఆఫ్రికా తీర్చుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈ వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ లను నమోదు చేస్తోంది. దీంతో ప్రత్యర్థి జట్ల మీద ఒత్తిడిని పెంచుతోంది. అయితే ఈరోజు మ్యాచ్ లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేస్తుండడంతో ఇది సాధ్యం కాదు. మరి ఇప్పుడు పాక్ జట్టును కట్టడి చేయాలంటే బౌలింగ్ ను కట్టుదిట్టంగా చేయాలి. లేదా ఒకవేళ పాక్ భారీ స్కోర్ ను లక్ష్యంగా ఇచ్చినా డికాక్ లాంటి ప్లేయర్లు రాణించాల్సి ఉంటుంది.

వరల్డ్ కప్ లో చెన్నైలో జరిగే ఆఖరి మ్యాచ్ ఇదే. ఇది స్పిన్ కు అనుకూలించే పిచ్. కానీ బ్యాటర్లు క్రీజ్ లో కుదురుకుంటే మాత్రం పరుగులు బాగా రాబట్టొచ్చు. ఇక్కడ లాస్ట్ జరిగిన నాలుగు మ్యాచ్ లలో ఛేజింగ్ చేసిన టీమ్ విజయం సాధించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు