PM Modi: ఈరోజే ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవం.. నెహ్రూ తర్వాత మూడుసార్లు వరుసగా ప్రధాని అయిన ఘనత కేవలం నేరంద్రమోదీది మాత్రమే. ఇప్పటికే పదేళ్ళు భారత్‌కు ప్రధానిగా పని చేసిన మోదీ మరో ఐదేళ్ళు బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధం అయ్యారు. ఈరోజే మోదీ ప్రమాణ స్వీకారోత్సవం. By Manogna alamuru 09 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi Oath Ceremony: వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయడానికి మోదీ రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన పదేళ్ళు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మరో ఐదేళ్ళు భారత్‌కు ప్రధానిగా మోదీ పని చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 7.15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఈ స్వీకారోత్సవానికి చాలా మంది ప్రముఖులు విచ్చేయనున్నారు. భారత్‌కు పొరుగు దేశాలు అయిన బంగ్లాదేశ్,శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ ప్రధానులు, అధ్యక్షులు హాజరవుతున్నారు. ప్రమాణ స్వీకారానికి ఇంక ఒక్కరోజే సమయం ఉండడంతో ఆహ్వానాలు అందిన దేశాల ప్రధానులు అందరూ దేశ రాజధానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీకి చేరుకున్నారు.అలాగే శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే,మాల్దీవుల అధ్యక్షుడు డా. మొహమ్మద్ ముయిజ్జు , సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్ ఈరోజు ఢిల్లీకి రానున్నారు. ఇక వీరితో పాటూ మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ , భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేలు కూడా ఇవాళ, లేదా రేపు ఉదయం లోపున చేరుకోనున్నారు. వీరి కోసం ప్రధాని కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భద్రత కట్టుదిట్టం.. వివధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు మోదీ ప్రమాణస్వీకారానికి హాజరవుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేశారు. రాష్ట్రపతి భవన్‌కు రక్షణగా ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించడంతో పాటు బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటూ ఎన్‌ఎస్‌జి కమాండోలు, డ్రోన్‌లు, స్నిపర్‌లు కూడా ఈ మెగా ఈవెంట్‌కు,రాష్ట్రపతి భవన్‌కు కాపలా కాయనున్నాయి. కర్తవ్య పథం పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాలను నిశితంగా పర్యవేక్షిస్తూ అధిక స్థాయిలో నిఘా ఉండేలా ఏర్పాట్లు చేశారు. దాంతో పాటూ ప్రతి దేశాధినేతకు సంబంధించిన ప్రోటోకాల్ అవసరాలకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు బస చేసే హోటళ్లలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. Also Read: Mamatha Benarji: కేంద్రంలో చట్ట విరుద్ధంగా ప్రభుత్వం కొలువుదీరుతోంది..మమతా బెనర్జీ #pm-modi #delhi #oath-ceremony మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి