Plants : విషపూరితమైన గాలి పోవాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెట్టాల్సిందే!

ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యాన్ని ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్నారు. అందుకని ఇంట్లో స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, క్రిస్మస్ కాక్టస్‌, ఫిలోడెండ్రాన్, పీస్ లిల్లీ, డ్రాకేనా లాంటి మొక్కలు పెట్టుకుంటే గాలిని శుద్ధి చేస్తాయి. గాలి నుంచి ఫార్మాల్డిహైడ్‌ను తొలగించడం ద్వారా గాలిని శుభ్రపరుస్తాయి.

New Update
Plants : విషపూరితమైన గాలి పోవాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెట్టాల్సిందే!

Air Purifying Plants In Home : చలికాలంలో గాలి నాణ్యత తరచుగా క్షీణిస్తుంది. అంతేకాకూండా ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యాన్ని ప్రతిఒక్కరూ ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంట్లో వాయుకాలుష్యం(Air Pollution)  అధికంగా లేకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. దానికోసం మీ ఇంట్లో పది మొక్కలు ఉంచుకోగలిగే వీటితో మీకు ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. గాలి కూడా శుభ్రంగా మారుతుంది.ఇంట్లో ఈ 10 మొక్కలు ఉంచండి.. విషపూరితమైన గాలి శుభ్రంగా మారుతుంది. ఆరోగ్యం అద్భుత ప్రయోజనాలను పొందుతుంది. అవి అలంకరణకు కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇంట్లో పెట్టుకునే కొన్ని మొక్కల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇంట్లో గాలి శుద్ధి చేసే మొక్కలు ఇవే..

స్పైడర్ ప్లాంట్: ఇది ఫార్మాల్డిహైడ్, బెంజీన్, జిలీన్ వంటి గాలిలో ఉండే కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయగలదు. స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది.

స్నేక్ ప్లాంట్: వాస్తు ప్రకారం ఈ పాము మొక్క కూడా మంచిదని భావిస్తారు. గదిలో ఉంచినట్లయితే.. గాలిలోని ఉన్న విషాన్ని శుభ్రపరుస్తుంది.

క్రిస్మస్ కాక్టస్‌: దీనిని ష్లమ్‌బెర్గెరా(Schlumbergera) అని కూడా అంటారు. రంపపు ఆకులతో కూడిన ఈ మొక్క ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. కాలుష్య కారకాలతో ఎక్కువ కాలం పోరాడుతూనే ఉంటుంది.

ఫిలోడెండ్రాన్: గాలి నుంచి ఫార్మాల్డిహైడ్‌ను తొలగించడం ద్వారా గాలిని శుభ్రపరుస్తుంది. గాలిని శుద్ధి చేయడానికి ఫిలోడెండ్రాన్ ఉత్తమ ఎంపిక.

పీస్ లిల్లీ: ఈ మొక్కలు గాలి నుంచి బెంజీన్, ఫార్మాల్డిహైడ్, అమ్మోనియాను ఫిల్టర్ చేస్తుంది.

గోల్డెన్ పోథోస్‌: దీనిని గోల్డెన్ మనీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలు ఆకులతో గదిలోని గాలిని శుభ్రపరుస్తుంది. అవి కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా గరిష్ట ఆక్సిజన్‌ను లభిస్తుంది.
డ్రాకేనా: ఈ మొక్కలు అనేక రంగులు, నమూనాలలో ఉంటాయి. చాలామంది వీటినిన బెడ్‌ రూప్‌లో పెట్టుకుంటారు. ఈ మొక్క ఆకులు రోజంతా ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. గదిలోని గాలిని శుద్ధి చేస్తుంది.
బ్రోమెలియడ్: ఇది ఒక గొప్ప ఇండోర్ ప్లాంట్. ఇది ఇంటిని అలంకరించడంతో పాటు గాలిని శుద్ధి చేస్తుంది.
బోస్టన్ ఫెర్న్: ఈ మొక్కను పడకగదిలో ఉంచడం వల్ల ఇండోర్ పొల్యూషన్ తగ్గుతుంది. ఈ మొక్క గాలిని ఫిల్టర్ చేసి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
అరేకా పామ్: ఈ మొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గాలిని శుభ్రపరుస్తుంది. ఈ ప్లాంట్ ఇండోర్ కాలుష్యం నుంచి రక్షించగలదు.

ఇది కూడా చదవండి: ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు.. కామెర్లు, కడుపు నొప్పి పరార్!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు