మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి.. కేంద్రానికి సీఎం హెచ్చరిక బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీలైనంత త్వరగా ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు. లేదంటే రాష్ట్రవాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ డిమాండ్ కు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ, ఇతర నాయకులు సపోర్ట్ ఇవ్వాలని కోరారు. By srinivas 17 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ రాష్ట్రానికి వీలైనంత త్వరగా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీహార్ అభివృద్ధి పథంలో సాగాలంటే ప్రత్యేక హోదా తమకు చాలా అవసరమని చెప్పారు. ఒకవేళ ఈ విషయంలో కేంద్రం జాప్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. Also read :ఒంటరి మహిళపై ఐదుగురు లైంగిక దాడి.. కట్టేసి సిగరేట్లతో కాలుస్తూ దారుణం ఈ మేరకు బీహార్ కు ప్రత్యేక హోదా కోసం జేడీయూ కొన్నేళ్లపాటు పోరాడుతుంది. కేంద్రం బీహార్‌కు త్వరగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం. ఈ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మూలకు ప్రత్యేక హోదా డిమాండ్ తీసుకెళ్తాం. మా డిమాండ్ కు మద్దతు ఇవ్వని వారంతా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవారే. దీంతో సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పలు సంక్షేమ పథకాలు అందించాలని నిర్ణయించాం. దీనికోసం బీహార్‌లాంటి పేద రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయాలు కావాలి. వాటిని ఐదేండ్లలో ఖర్చు చేస్తాం. అయితే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కల్పిస్తే ఆ సదుపాయాలన్నీ ప్రజలకు రెండున్నరేండ్లలోనే అందించగలుగుతాం. అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణమే అవసరం అంటూ నితీశ్ కుమార్ వివరించారు. #bihar #special-status #cm-nitish-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి