Boeing Flight : వరుసగా భయపెడుతున్న బోయింగ్ విమానం లోపాలు.. ఇప్పుడు భారత్‌లో కూడా ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ 737 మాక్స్ రకం విమానాల్లో వరుసగా లోపం బయటపడుతుండగా.. తాజాగా ఇండియాలో కూడా ఇలాంటి రకం విమానంలో వాషర్ లేనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని బోయింగ్ సంస్థ దృష్టికి తీసుకెళ్లామని.. ఆ సంస్థ చెప్పినట్లుగా చర్యలు తీసుకుంటామని డీజీసీఐ పేర్కొంది. By B Aravind 09 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Boeing Flight Defaults : బోయింగ్ 737 మాక్స్(Boeing 737 Max) రకం విమానాల్లో వరుసగా లోపాలు బయటపడటం అటు ప్రయాణికుల్ని ఇటు వైమానిక రంగానికి చెమటలు పట్టిస్తోంది. ఇటీవల ఈ రకం విమానాల్లో లోపాలు గుర్తించండం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌లైన్లు, ప్రభుత్వాలు వీటిపై తనిఖీలు చేయడం ప్రారంభించాయి. అయితే ఇప్పుడు ఇండియాలో కూడా వైమానిక రంగ నియంత్రణ సంస్థ(డీజీసీఐ) కూడా దీనిపై దృష్టి సారించింది. భారత్‌లో బోయింగ్ 737 మ్యాక్స్ రకం విమానాలు మొత్తంగా చూసుకుంటే 40 వరకు ఉన్నాయి. ఇందులో ఆకాక ఎయిర్ 22, స్పెస్ జెట్ 9, అలాగే ఇండియా ఎక్స్‌ప్రెస్ మరో 9 విమానాలను నడుపుతున్నాయి. Also read: లక్షద్వీప్‌లో నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియ ప్రారంభం..! వాషర్ లేదు ప్రపంచవ్యాప్తంగా ఈ రకం విమానాల్లో తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో ఇండియా(India) లో కూడా ఈ విమానాల్లో డీజీసీఐ(DGCI) తాజాగా తనిఖీలు చేపట్టింది. అయితే వీటిల్లోని ఒక విమానంలో వాషర్ లేనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆ సంస్థ మంగళవారం తెలిపింది. ఇప్పటివరకు 39 విమానల్లో తనిఖీలు పూర్తి కాగా.. 40వ విమానంలో మాత్రం వాషర్ కనిపించకపోవడం కలకలం రేపింది. అయితే ఈ విషయాన్ని బోయింగ్ సంస్థ దృష్టికి తీసుకెళ్లామని.. ఆ సంస్థ చెప్పినట్లుగా చర్యలు తీసుకుంటామని డీజీసీఐ పేర్కొంది. వరుసగా లోపాలు ఇటీవల జరిగిన పలు ఘటనలను పరిశీలిస్తే.. అలస్కా ఎయిర్‌లైన్స్(Alaska Airlines) కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 రకం విమానం 177 మంది ప్రయాణికులతో వెళ్తోంది. అయితే ఆ విమానం గాల్లో ఉండగానే.. ఒక్కసారిగా డోర్‌ప్లగ్ ఊడింది. దీంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం కొనసాగించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక గత నెల చివర్లో కూడా బోయింగ్ 737 మ్యాక్స్ విమానంలోని రడ్డర్ కంట్రోల్ సిస్టమ్‌లో కీలకంగా ఉండే ఓ బోల్ట్‌కు నట్లు లేనట్లు సిబ్బంది గుర్తించారు. Also Read: ఫిజిక్స్‌లో మాస్టర్స్, సంస్కృతం టాపర్.. నాలుగేళ్ల కుమారుడిని చంపిన సీఈవో సుచనా ఫ్రొఫైల్! ఇదిలా ఉండగా.. ఐదు సంవత్సరాల క్రితం కొన్ని నెలల్లోనే ఇండోనేషియా, ఇథియోపియా దేశాల్లో రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలిపోయాయి. ఈ దుర్ఘటనల్లో మొత్తం 346 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 నెలల పాటు ఈ బోయింగ్ 737 మ్యాక్స్ రకం విమానాలను పక్కన పెట్టేశారు. దీనివల్ల బోయింగ్‌కు ఏకంగా 20 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయింది. ఇంత జరిగాక కూడా ఇప్పుడు కూడా ఆ రకం విమానాల్లో లోపాలు బయటపడటం ఆందోళన రేపుతోంది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో ప్రయాణం అంటేనే ప్రయాణికులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. #telugu-news #national-news #boeing-flight #boeing-737-max #dgci మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి