Paris Olympics: షూటింగ్‌లో ఫైనల్స్‌కు చేరుకున్న టికెట్ కలెక్టర్

భారత షూటర్‌ స్వప్నిల్ కుశాలె పారిస్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల 3 పొజిషన్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో భారత్‌కు మరో పతకం రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు టేబుల్ టెన్నీస్ నుంచి 16వ రౌండ్‌లో మనికా పోటీల నుంచి వైదొలిగింది.

New Update
Paris Olympics: షూటింగ్‌లో ఫైనల్స్‌కు చేరుకున్న టికెట్ కలెక్టర్

Swapnil Entered In To Finals In Shooting: ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు రావడం గ్యారంటీ అని ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. వాటికి తగ్గట్టే ఇప్పటికే షూటింగ్‌లో రెండు పతకాలు వచ్చాయి. ఇప్పుడు మరో పతకం కూడా దారిలో ఉంది. 50 మీటర్ల 3 పొజిషన్‌ ఈవెంట్‌లో స్వప్నిల్ కుశాలె ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో స్వప్నిల్ ఏడో స్థానంలో నిలవడంతో ఈ విజయాన్నిసాధించాడు. అంతేకాదు ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత షూటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈరోజు మధ్యాహ్నం 1గంటకు ఫైనల్‌ జరగనుంది.

29 ఏళ్ల స్వప్నిల్‌ మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి, సోదరుడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. తల్లి గ్రామ సర్పంచ్. స్వప్నిల్ 2012 నుంచి అంతర్జాతీయ ఈవెంట్‌లలో పాల్గొంటున్నాడు. అయితే అతనికి ఇది అంత ఈజీగా రాలేదు. 12ఏళ్ళు కష్టపడ్డాకనే ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ షూటర్‌ 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే భారత తరఫున వివిధ ఈవెంట్లలో బరిలోకి దిగుతున్నాడు స్వప్నిల్. తనకు కెప్టెన్ కూల్ ధోనీ ఆదర్శనమని చెబుతున్నాడు. ధోనీని చూసే తాను ఎన్నో నేర్చుకున్నానని చెప్పాడు. అతని జీవితానికి నా జీవితానికి దగ్గర సంబంధం ఉంది. నేను అతనిలాగే టికెట్‌ కలెక్టర్‌ని. అతను మైదానంలో ప్రశాంతంగా, ఓపికగా ఉంటాడు. షూటర్‌గా రాణించాలంటే ధోనీలా కూల్‌గా ఉండటం అవసరం. ప్రతి షాట్‌ను జాగ్రత్తగా పేల్చాలి. నేను ఓపికగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. మ్యాచ్ మొత్తం ఇదే విధంగా ఉండేలా చూసుకుంటున్నా. మనస్సులో స్కోర్‌ల గురించి ఆలోచిస్తూ కాకుండా ఓపికగా, ప్రశాంతంగా ఉంటూ షూట్‌ చేయాలి. ఒలింపిక్స్‌లో ఇక్కడి వరకు వచ్చినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. తనకు పతకం తేవడానికి శాయశక్తులా ప్రయత్నితానని తెలిపాడు స్వప్నిల్.

మరోవైపు బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్‌లు 16వ రౌండ్‌కు అర్హత సాధించారు. అలాగే టేబుల్ టెన్నీస్‌లో తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ కూడా 16వ రౌండ్‌కు దూసుకెళ్ళింది. ఆ్చరీలో దీపికా కుమారి 16వ రౌండ్‌కు చేరుకుంటే..టేబుల్ టెన్నీస్‌లో మనికా ఓటమి పాలయింది. ఇక బాక్సింగ్‌లో లవ్లీనా ఫైనల్స్‌కు చేరింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు