/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-117.jpg)
Building collapsed: ఇండియాలో చాలాచోట్ల విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ అంతా భారీ వానలు పడుతున్నాయి. గుజరాత్‌లో గత కొద్ది రోజులుగా ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ అంతా లమయం అయిపోయింది. చాలా ఇళ్ళు కూడా నీట మునిగాయి. ఈ కారణంగా గుజరాత్‌లోని ద్వారకలోని ఖంభాలియా తాలూకాలో మూడు అంతస్తుల ఇల్లు కూలిపోయింది. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని ఎన్‌డిఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Also Read:Budget 2024: ప్రజలను మోసగించిన బడ్జెట్- బెంగాల్ సిఎం మమత బెనర్జీ