PM Modi: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టం: మోదీ

మహిళలపై నేరాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. నేరస్తులను శిక్షించేందుకు భారతీయ న్యాయ సన్హిత (BNS)ను తీసుకొచ్చి ఇందులో అనే అనేక సవరణలు చేశామని పేర్కొన్నారు. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

New Update
PM Modi: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టం:  మోదీ

దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఓ చోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో వారి భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటన, బద్లాపూర్‌లోని ఓ స్కూల్‌లో బాలికలపై లైంగిక దాడి, అస్సాంలో గ్యాంగ్ రెప్ లాంటి ఘటనలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నేరస్తులను శిక్షించేందుకు కఠినమైన చట్టాలను తీసుకొస్తున్నామని అన్నారు.

Also Read: పెన్షన్ స్కీమ్ లో మార్పులు.. UPS – NPS మధ్య తేడాలు ఇవే!

బాధితులకు న్యాయం చేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించడం, అలాగే కొత్త చట్టాలను రూపొందించడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావించారు. '' ఇంతకుముందు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయని ఫిర్యాదులు ఉండేవి. ఈ సమస్యలను పరిష్కరించడం కోసం మేము భారతీయ న్యాయ సన్హిత (BNS)ను తీసుకొచ్చాము. ఇందులో అనే అనేక సవరణలు చేశాం. ఒక మహిళ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లలేకపోతే ఆమె ఈ-ఎఫ్‌ఐఆర్‌ ఫైల్ చేయొచ్చు. దీన్ని ఎవరూ మార్చలేరు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.

ఈరోజు మీకు నేను ఓ సవాల్ చేస్తున్నా. గత 70 ఏళ్ల ప్రభుత్వ పాలనలను ఓ పక్కన పెట్టండి. గత పదేళ్ల మోదీ పాలనను పక్కన పెట్టి చూడండి. స్వాతంత్ర్యం వచ్చాక ఈ దేశ సోదరీమణులు, బిడ్డల కోసం మోదీ ప్రభుత్వం చేసినంత ఏ ప్రభుత్వం కూడా చేయలేదని'' ప్రధాని మోదీ అన్నారు. ఇదిలాఉండగా జలగావ్‌ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో లఖ్పతి దీదీలతో మోదీ మాట్లాడారు. వార్షిక ఆదాయం రూ.1 లక్ష లేదా అంతకన్నా ఎక్కువ ఆదాయం సాధించిన స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులను లఖ్పతి దీదీలు అని అంటారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ 11 లక్షల మంది కొత్త లఖ్పతి దీదీలను సత్కరించారు. అలాగే రూ. 5 వేల కోట్ల బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు. దీనివల్ల 2.35 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 25.8 లక్షల మంది మహిళా సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది.

Also Read: చంద్రయాన్-3 విజయాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు: ప్రధాని మోదీ

లఖ్పతి దీదీ పథకం ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఇప్పటివరకు కోటి మంది మహిళలు లఖ్పతి దీదీలుగా మారారు. అలాగే మహిళల సాధికరత, ఆర్థిక వృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు