OTT : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఈ వారం ఏకంగా 24 సినిమాలు రిలీజ్..!

ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఓ నాలుగు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. 'మీర్జాపుర్' సిరీస్ మూడో సీజన్‌తోపాటు గరుడన్, మలయాళీ ఫ్రమ్ ఇండియా, ఫ్యూరిసోయా మ్యాడ్ మ్యాక్స్ చిత్రాలు ఉన్నంతలో చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.

New Update
OTT : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఈ వారం ఏకంగా 24 సినిమాలు రిలీజ్..!

This Week OTT Releases : ప్రతీ వారం ఓటీటీల్లోకి (OTT) ఆకట్టుకునే సినిమాలు (Cinemas), వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. ఆడియన్స్ కూడా ఓటీటీ కంటెంట్ కు బాగా అలవాటు పడిపోయారు. దాన్ని ఓటీటీ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇక ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా ఓటీటీల్లో ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ (Web Series) లు రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం ఏకంగా 24 సినిమాలు విడుదలవుతుండటం విశేషం. అందులో కొన్ని మాత్రమే ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటి? అవి ఏయే ఓటీటీల్లోకి వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

నెట్‌ఫ్లిక్స్

  •  స్టార్ ట్రెక్ ప్రొడిగీ: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01
  • అల్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01
  • బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 02
  • స్ప్రింట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 02
  • ద మ‍్యాన్ విత్ 1000 కిడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03
  • రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 04
  • బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 04
  • గోయో (స్పానిష్ మూవీ) - జూలై 05
  • డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) - జూలై 05

అమెజాన్ ప్రైమ్

  • గరుడన్ (తమిళ సినిమా) - జూలై 03
  • బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 03
  • స్పేస్ క్యాడెట్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 04
  • మీర్జాపుర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 05

హాట్‌స్టార్

  • రెడ్ స్వాన్ (కొరియన్ సిరీస్) - జూలై 03
  • ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ సిరీస్) - జూలై 04

జియో సినిమా

  • ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ సిరీస్) - జూలై 03
  • హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) - జూలై 05

ఆహా (Aha)

  • హరా (తమిళ సినిమా) - జూలై 05

బుక్ మై షో

  • ఇఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 03
  • ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (ఇంగ్లీష్ మూవీ) - జూలై 04
  • ద సీడింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - జూలై 05
  • విజన్స్ (ఫ్రెంచ్ సినిమా) - జూలై 05

సోనీ లివ్

  • మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ మూవీ) - జూలై 05

Also Read : చంద్రబాబు.. ప్రత్యేక ప్యాకేజీలు కాదు.. ఇది మనకు ముఖ్యం: షర్మిల

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HBD Allu Arjun: బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ సాధించిన 8 అరుదైన రికార్డులు ఇవే

ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీ తన కెరియర్‌లో సాధించిన రేర్ రికార్డులు ఉన్నాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో ఇతడే. అలాగే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కైవసం చేసుకున్న తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు.

New Update
allu arjun.

allu arjun

ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు, ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అరుదైన రికార్డులు సాధించిన టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. అందువల్ల అల్లు అర్జున్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో సాధించిన అరుదైన రికార్డులు తెలుసుకుందాం. 

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

Allu Arjun Rare Records

అల్లు అర్జున్ తెలుగు చిత్ర సీమలో ఏ దిగ్గజ నటుడికి దక్కని అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. 2023లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సాధించాడు. ఈ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప: ది రైజ్‌లో తన పాత్రకు ఈ అవార్డు వరించింది. 

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో దేశంలోనే రెండో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో బన్నీ ‘పుష్ప2’ రికార్డు క్రియేట్ చేసింది. ఇది దాదాపు రూ.1831 కోట్ల వసూళ్లు రాబట్టింది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

అల్లు అర్జున్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు ఉంది. అదే "ఇండియన్ ఆఫ్ ది ఇయర్" అవార్డు. దీనిని బన్నీ 2022లో దక్కించుకున్నాడు. ఈ అవార్డు ఎంటర్‌టైన్మెంట్ కేటగిరీలో లభించింది. దీంతో ఈ అవార్డును సొంతం చేసుకున్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ గుర్తింపు పొందాడు. 

అల్లు అర్జున్ ‘పుష్ప2’ కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. అతడు 2024లో అత్యధిక పారితోషికం దాదాపు రూ.300 కోట్లు తీసుకున్న భారతీయ నటుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. 

అల్లు అర్జున్ ఇటీవల 2024లో 74వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్నాడు. అక్కడ బన్నీ భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

 అల్లు అర్జున్ తన కెరీర్‌లో అతి ముఖ్యమైన మైలురాయిని నెలకోల్పాడు. అల్లు అర్జున్ మైనపు విగ్రహం దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. దీంతో దక్షిణ భారతదేశం నుండి ఈ గౌరవం అందుకున్న తొలి నటుడిగా బన్నీ రికార్డు క్రియేట్ చేశాడు. 

అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 28 మిలియన్లకు పైగా  ఫాలోవర్స్ ఉన్న సౌత్ యాక్టర్‌గా రికార్డు సృష్టించాడు. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

బన్నీ కెరీర్‌లో అందరికీ గుర్తుండిపోయే చిత్రం దేశముదురు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్‌ ప్యాక్‌తో అదరగొట్టేశాడు. దీంతో సిక్స్ ప్యాక్ చేసిన ఫస్ట్ టాలీవుడ్ హీరోగా ఐకాన్‌ స్టార్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 

(telugu-news | latest-telugu-news | hbd-allu-arjun | allu-arjun | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | breaking news telugu)

Advertisment
Advertisment
Advertisment