/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-09T104831.106.jpg)
Vijay Devarakonda New Movie First Look : టాలీవుడ్(Tollywood) రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రీసెంట్ గా 'ఫ్యామిలీ స్టార్' అనే క్లాస్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిచారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈసారి విజయ్ దేవరకొండ, దిల్ రాజు ఓ ఊర మాస్ మూవీతో రాబోతున్నారు.
దిల్ రాజు నిర్మాణంలో 'రాజా వారు రాణి గారు' మూవీ ఫేమ్ కిరణ్ కోలా దర్శకతంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించగా.. నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే(Birthday) కావడంతో ఈ సినిమాకి సంబంధించి ఓ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read : సాయి పల్లవికి ‘తండేల్’ టీమ్ బర్త్ డే గిఫ్ట్.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!
విజయ్ దేవరకొండ ఊరమాస్ సినిమా
తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో.." కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.." అంటూ రక్తంతో తడిసిన చేయి కత్తి పట్టుకొని ఉంది. పోస్టర్ మొత్తం రెడ్ కలర్ థీమ్ తోనే ఉంది. దీన్ని బట్టి ఈసారి విజయ్ దేవరకొండ ఊరమాస్ యాక్షన్ మూవీతో రాబోతున్నట్లు అర్థమవుతుంది.
జస్ట్ పోస్టర్ లోని డైలాగ్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 59 ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
“The blood on my hands is not of their death.. but of my own rebirth..“
Ravi Kiran Kola X Vijay Deverakonda@SVC_official pic.twitter.com/xGXXiNbVQu
— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024