Telangana Elections: ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచింది వీళ్లే ... ఓ లుక్కేయండి! ఈసారి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో 50 మంది ఎమ్మెల్యేలు మొట్టమొదటి సారి అసెంబ్లీకి రాబోతున్నారు. వారిలో జానా రెడ్డి కుమారుడు అయిన జయవీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ మొదలైన వారు ఉన్నారు. By Bhavana 04 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి First time MLA Candidates in Telangana: తెలంగాణ లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం..అభ్యర్థులు ప్రచారం చేయడం..ఎన్నికలు జరగడం...ఫలితాలు కూడా రావడం..ఇవన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. ముందు నుంచి కొందరు విశ్లేషకులు చెబుతున్నట్లుగానే ఈ సారి రాష్ట్రాన్ని ''హస్త''గతం చేసుకుంది. ఈ సారి ఎన్నికల్లో గెలిచిన వారిలో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఒకరు ఇద్దరు కాదు...ఏకంగా 50 మంది ఉన్నారు. వీరిలో గతంలో ఎంపీగా గెలిచిన వారు కూడా కొందరు ఉన్నారు. హస్తం పార్టీ నుంచే ఈసారి సుమారు 34 మంది అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా..అని అనబోతున్నారు. ఈ సారి ''కారె''క్కి వచ్చే వారు కేవలం పది మంది మాత్రమే తొలిసారి అసెంబ్లీకి వచ్చే వారు ఉన్నారు. కమలం పార్టీ నుంచి ఈసారి 8 మంది గెలిస్తే వారిలో ఏడుగురు మొదటిసారి సభకి రాబోతున్నవారే. ఈసారి హస్తం పార్టీ నుంచి అసెంబ్లీకి రాబోతున్న సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. పాలేరు నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అసెంబ్లీకి రానున్నారు. ఇయన బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరి గెలిచారు. ఇక హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కూడా మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. చెన్నూర్ నుంచి గెలిచిన వివేక్ వెంకట స్వామి కూడా మొదటిసారే అసెంబ్లీలోకి కాలు పెట్టనున్నారు. Also read: నల్గొండ లో బస్సు ప్రమాదం..ఒకరు సజీవ దహనం..38 మందికి! జానా రెడ్డి కుమారుడు అయిన జయవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. ఇక మెదక్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచిన మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ (Mynampally Rohit) కూడా మొదటిసారే అసెంబ్లీకి రాబోతున్నారు. డీకే అరుణ మేనకోడలు, ఐఏఎస్ అధికారి లక్ష్మీ కుమార్తె అయినటువంటి పర్ణికా రెడ్డి నారాయణపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయాన్ని అందుకున్నారు. ఇక తూడి మేఘా రెడ్డి వనపర్తి నియోజక వర్గం నుంచి పోటీలో నిలిచి గెలిచాడు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మట్టా రాగమయి అసెంబ్లీకి రాబోతున్నారు. ఇక యశస్విని రెడ్డి (Yashaswini Reddy) పాలకుర్తి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి గెలిచి అసెంబ్లీకి వస్తున్నారు. ఈ క్రమంలోనే ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ , మక్తల్ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి, దేవరకద్ర నియోజకవర్గం నుంచి మధుసూదన్ రెడ్డి , జడ్చర్ల నియోజకవర్గం నుంచి అనిరుధ్ రెడ్డి , కల్వకుర్తి నియోజకవర్గం నుంచి నారాయణ రెడ్డి బరిలో నిలిచి మొదటి సారి అసెంబ్లీకి రాబోతున్నారు. ఇక వేములవాడ నియోజకవర్గం నుంచి ఆది శ్రీనివాస్, మానకొండూరు బరిలో విజయం సాధించిన సత్యనారాయణ, రామగుండం నియోజకవర్గం నుంచి రాజ్ ఠాకూర్, చొప్పదండి బరిలో గెలిచిన మేడిపల్లి సత్యం , నిజామాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన భూపతి రెడ్డి, జుక్కల్ నియోజకవర్గం నుంచి గెలిచిన లక్ష్మీ కాంతారావు, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, తాండూరు నుంచి గెలిచిన మనోహర్ రెడ్డి లు అంతా కూడా మొదటి సారి అసెంబ్లీకి రాబోతున్న వారే. మంచిర్యాల నియోజక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, వెడ్మా బొజ్జు ఖానాపూర్ నుంచి గెలిచారు. ఇక భువనగిరి నియోజకవర్గం నుంచి కుంభం అనిల్ రెడ్డి , బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ నుంచి, తుంగతుర్తి నుంచి గెలిచిన మందల శామ్యేల్ , వైరా నియోజక వర్గం నుంచి రాందాస్ నాయక్, అశ్వరావుపేట నియోజక వర్గం నుంచి గెలుపొందిన ఆదినారాయణ, వర్థన్న పేట నియోజకవర్గం నుంచి కేఆర్ నాగరాజు, డోర్నకల్ నియోజకవర్గం నుంచి రాంచంద్రు నాయక్, మహబూబాబాద్ నియోజక వర్గం నుంచి మురళీనాయక్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నాయిని రాజేందర్ రెడ్డి అందరూ కూడా మొదటి సారి అసెంబ్లీకి రాబోతున్న వారే కావడం విశేషం. Also read: విద్యార్ధులకు ఆలర్ట్.. ఈ రోజు సెలవు…!! వీరంతా హస్తం పార్టీ నుంచి అసెంబ్లీకి రాబోతుంటే..కారు పార్టీ నుంచి గెలిచి అసెంబ్లీకి రాబోతున్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి హూజూరాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీకి రాబోతున్నారు. జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. దుబ్బాక నియోజక వర్గం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి సభకు రాబోతున్నారు. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లాస్య నందిత అసెంబ్లీకి రాబోతున్నారు. ఇక అలంపూర్ నియోజకవర్గం నుంచి విజేయుడు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. కోరుట్ల నుంచి సంజయ్ గెలిచి సభకు రాబోతున్నారు. మల్కాజిగిరి నుంచి గెలిచిన మర్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీకి రాబోతున్నారు. ఇక ఉప్పల్ నుంచి లక్ష్మారెడ్డి, బోథ్ నుంచి అనిల్ జాదవ్, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావులు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇక కమలం పార్టీ నుంచి గెలిచిన 8 మందిలో 7 గురు కొత్తవారే ఉన్నారు. వారు వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం , ఆర్మూర్ నుంచి రాకేశ్ రెడ్డి, సిర్పూర్ నుంచి పాల్వాయి హరీష్, ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, ముథోల్ నియోజకవర్గం నుంచి రామారావు పటేల్, భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గండ్ర సత్యనారాయణ గెలిచి అసెంబ్లీకి రాబోతున్నారు. ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోయే ఎమ్మెల్యేల్లో యువ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. ఈ 50 మందిలో ఓ ముగ్గురు అయితే అతి పిన్న వయస్కులుగా రికార్డు కూడా సాధించారు. యశస్విని రెడ్డి పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి పై విజయం సాధించారు. ఆమె వయసు 26 సంవత్సరాలు మాత్రమే. అంతేకాకుండా మైనంపల్లి రోహిత్‌కి కూడా 26 సంవత్సరాలే. ఇక డీకే అరుణ మేనకోడలు అయినటువంటి పర్ణికా రెడ్డి వయసు కేవలం 30 ఏళ్లు. Also read: రహస్యంగా రానా తమ్ముడి వివాహం..అమ్మాయి ఎవరంటే! #congress #telangana #telangana-elections-2023 #mla #telangana-mla-candidates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి