Marriage Season: లక్షలాది వివాహాలు..లక్షల కోట్ల వ్యాపారం.. పీక్స్ లో పెళ్లిళ్ల సీజన్ అంచనాలు మాఘ మాసం వచ్చేసింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. ఈ సీజన్ లో దేశవ్యాప్తంగా 45 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ వివాహాల ద్వారా ఐదున్నర లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లెక్కవేస్తోంది. By KVD Varma 13 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Marriage Season: మన దేశంలో పెళ్లి అంటే మామూలుగా ఉండదు. పెద్ద ఉత్సవంలా ఉంటుంది. ఇంట్లో కొడుకు లేదా కూతురు పెళ్లి చేయాలంటే.. స్థోమతకు మించి ఖర్చు చేయడం చాలా సహజం. దానికి చాలా కారణాలున్నాయి. మన దేశంలో వివాహానికి చేసే ఖర్చు మరేదేశంలోనూ చేయరు అంటే అతిశయోక్తి కాదు. మాఘమాసం వచ్చేసింది. దీంతో పాటే పెళ్లిళ్లకు ముహూర్తాలు వచ్చేశాయి. ఇప్పటి నుంచి దాదాపుగా జూలై నెలవరకూ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు దేశంలోని వ్యాపార వర్గాలు పెళ్లిళ్ల సీజన్‌పై ఉత్సాహంగా ఉన్నాయి. నిజానికి జనవరి 15 నుంచి మొదలైంది. ఈ సీజన్ (Marriage Season)జూలై 15 వరకు కొనసాగుతుంది(ప్రాంతాలను బట్టి ఈ ముహూర్తాలు మారవచ్చు). ఈ సీజన్ లో దేశంలో 45 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. దేశంలో జరుగుతున్న ఈ పెళ్లిళ్లలో దాదాపు రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని భావిస్తున్నారు. దేశంలోని వ్యాపారవేత్తల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) పరిశోధన విభాగం.. క్యాట్ రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ వివిధ రాష్ట్రాల్లోని 30 వేర్వేరు నగరాలకు చెందిన వ్యాపారులు- సర్వీస్ ప్రొవైడర్లతో జరిపిన చర్చల ఆధారంగా ఈ అంచనాను రూపొందించింది. ఒక్క ఢిల్లీలోనే రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం.. ఒక్క ఢిల్లీలోనే ఈ పెళ్లిళ్ల సీజన్‌లో(Marriage Season) 4 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీని ద్వారా దాదాపు రూ.1.5 లక్షల కోట్ల వ్యాపార ఆదాయం సమకూరుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. గతేడాది డిసెంబరు 14తో ముగిసిన పెళ్లిళ్ల సీజన్‌లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరగ్గా.. వీటి ఖర్చు రూ.4.25 లక్షల కోట్లుగా తేలింది. అప్పటికంటే.. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని అంచనా. అందుకే వ్యాపారం కూడా బాగా వృద్ధి చెందుతుంది అని భావిస్తున్నారు. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో (Marriage Season)దాదాపు 5 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి సగటున ఖర్చు రూ. 3 లక్షలు అవుతుందని అంచనా వేసహ్రు. అదేవిధంగా 10 లక్షల పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు దాదాపు రూ.6 లక్షలు అవుతుందని లెక్క కట్టారు. ఇక మరో 10 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ. 10 లక్షలు, ఇంకో 10 లక్షల పెళ్లిళ్లకు రూ. 15 లక్షలు, 6 లక్షల పెళ్లిళ్లకు రూ. 25 లక్షలు ఖర్చవుతుందని అంచనాలు వేశారు. ఎందుకంటే, అందరూ పెళ్లిళ్లకు ఒకేరకంగా ఖర్చు చేయరు కదా. ఇవే కాకుండా ఒక్కో పెళ్లికి రూ.50 లక్షలు ఖర్చయ్యే 60 వేల పెళ్లిళ్లు, కోటి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే 40 వేల పెళ్లిళ్లు ఈ ఏడాది ఉండవచ్చని భావిస్తున్నారు. Also Read: డ్రోన్ కి ఎక్కువ.. హెలికాఫ్టర్ కి తక్కువ.. మారుతి ఎగిరే కారు వచ్చేస్తోంది! వ్యాపారం పెరుగుతుంది ఈ వివాహ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా సంబంధిత వ్యాపారులు వివాహ సంబంధిత వస్తువులను తగినంత స్టోర్ చేసుకున్నారనీ, దీని వలన కస్టమర్ల డిమాండ్‌ను తీర్చవచ్చని భర్తియా అలాగే ఖండేల్‌వాల్ చెప్పారు. ప్రతి వివాహానికి దాదాపు 20 శాతం ఖర్చు వధూవరుల సొంతంగా అవుతుంది. మిగిలిన 80 శాతం ఖర్చులు వివాహ నిర్వహణకు సంబంధించిన థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా అవుతుంది. పెళ్లిళ్ల సీజన్‌కు(Marriage Season) ముందు ఇంటి రిపేర్, పెయింటింగ్‌లో చాలా వ్యాపారం జరుగుతుందని వ్యాపారవేత్తలిద్దరూ చెప్పారు. ఇది కాకుండా, ఆభరణాలు, చీరలు, లెహంగా-చునారి, ఫర్నిచర్, రెడీమేడ్ వస్త్రాలు, బట్టలు, పాదరక్షలు, వివాహ సమయంలో ఇతర శుభకార్యాలు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, పండ్లు, పూజా దుస్తులు, కిరాణా, తృణధాన్యాలు, అలంకార వస్త్రాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ వస్తువులు , వివిధ గిఫ్ట్ ఆర్టికల్స్ మొదలైనవి అత్యధిక డిమాండ్‌లో ఉన్నాయి, ఇవి ఈ సీజన్‌లో భారీ వ్యాపారాన్ని పొందగలవని భావిస్తున్నారు. వీటితో పాటు ఫొటోగ్రఫీ, ఫంక్షన్ హాల్స్, లైటింగ్, డీజే ఇలాంటి సర్వీసులకు కూడా ఈ ఏడాది ఫుల్ డిమాండ్ ఉంటుందని ఆ లెక్కలు చెబుతున్నాయి. Watch this Interesting Video : #marriage #indian-marriage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి