Telangana: ఇంట్లో రూ.950 కోట్లు కొట్టేయాలని ప్లాన్.. చివరికి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో ఓ యజమాని ఇంట్లో బ్లాక్ మనీ ఉందని తెలుసుకున్న కొంతమంది దండగులు దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. సీసీకెమెరాలో వారిని గుర్తించిన యాజమాని పోలీసులకు ఫోన్ చేశాడు. వాళ్లు వచ్చేలోపే దుండగులు అక్కడినుంచి పరారయ్యారు.

New Update
Telangana: ఇంట్లో రూ.950 కోట్లు కొట్టేయాలని ప్లాన్.. చివరికి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ యజమాని ఇంట్లో బ్లాక్ మనీ ఉందని తెలుసుకున్న కొంతమంది దండగులు దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. సీసీకెమెరాలో వారిని గుర్తించిన యాజమాని పోలీసులకు ఫోన్ చేశాడు. అప్పటికే దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. ఇక వివకరాల్లోకి వెళ్తే.. తుర్కయాంజల్‌ శ్రీరామ్‌నగర్‌లో ఓ చాక్లెట్‌ కంపెనీ యజమాని తురమనతురై నివాసం ఉంటున్నారు. అయితే అతని ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందని.. ఓ వ్యక్తి ద్వారా బ్రాహ్మణపల్లికి చెందిన బోగిని జంగయ్య, మన్సూరాబాద్‌కు చెందిన శేఖర్‌రెడ్డి, ఎండీ మైమూద్‌లు తెలుసుకున్నారు.

దీంతో ఆ నల్లధనాన్ని ఎలాగైన కొట్టేయాలని పథకం పన్నారు. నల్లధనం స్థానంలో నల్ల కాగితాలు పెట్టి డబ్బులు ఎత్తుకెళ్లాలని ప్లాన్ వేశారు. దీంతో ఈ నెల 10న అర్ధరాత్రి 10 గంటలకు కొంతమంది చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి మెయిన్‌ తలుపును ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా శబ్దం వచ్చింది. దీంతో అప్రమత్తమైన యజమాని సీసీ కెమెరాలను పరిశీలించారు. కొందరు ఇంట్లోకి వస్తున్నట్లు తెలుసుకొని డయల్ 100కు కాల్ చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి వచ్చేలోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: గంజాయి కలకలం.. 12 మంది అరెస్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు