Hundi: గుడి హుండీలో దొంగతనానికి యత్నం.. ఇరుక్కుపోయిన చెయ్యి కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలో పోచమ్మ ఆలయంలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి.. మంగళవారం రాత్రి హుండీలో డబ్బులు దొంగిలించేందుకు యత్నించాడు. కానీ అతడి చేయి హుండీలో ఇరుక్కుపోయి బయటికి రాలేదు. ఉదయం అతడిని చూసిన స్థానికులు కట్టర్ సాయంతో చేయి బయటికి తీశారు. By B Aravind 03 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ గుడిలో పనిచేస్తున్న వ్యక్తి.. ఆ గుడిలో హుండీలో డబ్బులు దొంగతనం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆ హుండీలోని అతడి చేయి ఇరుక్కుపోయింది. చివరికి ఉదయం గుడికి వచ్చిన స్థానికులు అతడి చేయిని బయటికి తీశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో సురేశ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. హుండీలో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లాని అనుకున్నాడు. Also Read: అభిలాష్ మృతిపై వీడని మిస్టరీ ఇందుకోసం మంగళవారం రాత్రి ఆలయంలోకి వచ్చాడు. హుండీ పైభాగాన్ని ధ్వంసం చేసి.. అందులో చేయి పెట్టి డబ్బులు తీయాలని చూశాడు. కానీ చేయి అందులోనే ఇరుక్కుపోయింది. బయటికి తీయడానికి ఎంత ప్రయత్నించిన రాలేదు. దీంతో అలాగే ఉండిపోయాడు. అతడికి అతడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చివరకి కట్టర్ సహాయంతో హుండీని కత్తిరించి.. సురేష్ చెయ్యిని బయటికి తీశారు. ఆ ఆ తర్వాత పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన చెయ్యి.. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో పనిచేసే సురేశ్ హుండి పై భాగాన్ని ధ్వంసం చేసి అందులో డబ్బు తీసేందుకు లోపల చెయ్యి పెట్టగా అది హుండీలో ఇరుక్కుపోయింది. ఉదయం గుడికి వచ్చిన భక్తులు చూసి పోలీసులకి… pic.twitter.com/CtLrzQqiM6 — Telugu Scribe (@TeluguScribe) April 3, 2024 Also Read: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్ #telugu-news #robbery #hundi #komareddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి