Smart TV Offer: కిర్రాక్ ఆఫర్..రూ. 86వేల స్మార్ట్ టీవీ రూ. 22, 800కే..వెంటనే కొనేయ్యండి..!!

ఫ్లిప్ కార్ట్ కిర్రాక్ డీల్ అందుబాటులో ఉంది. కూకా ఫ్రేమ్‌లెస్ 55 ఇంచుల స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. ఇది ఆల్ట్రా హెచ్డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ. ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 86 వేలుగా ఉంది.దీన్ని కేవలం రూ. 23,999కే కొనుగులు చేయవచ్చు.

New Update
Smart TV Offer: కిర్రాక్ ఆఫర్..రూ. 86వేల స్మార్ట్ టీవీ రూ. 22, 800కే..వెంటనే కొనేయ్యండి..!!

Smart TV Offer:  మీ ఇంట్లోకి కొత్త స్మార్ట్ టీవీ కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకో శుభవార్త.ఈ విషయం తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఎగిరిగంతేస్తారు. ఎందుకంటే భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దిగ్గజ ఈ కామర్స్ సంస్థలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ లో కిర్రాక్ డీల్ లభిస్తోంది. స్మార్ట్ టీవీపై ఏకంగా వేలలో తగ్గింపు లభిస్తుంది. మీరు పెద్ద స్మార్ట్ టీవీని కొనాలనుకుంటే తక్కువ ధరకే దాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్కార్ట్ లో కూడా ఫ్రేమ్ లెస్ 55ఇంచుల స్మార్ట్ టీవీ కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది ఆల్ట్రా హెచ్డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ టీవీ. ఈ స్మార్ట్ టీవీని మీరు తక్కువ ధరకు కొనవచ్చు.ఈ టీవీపై దాదాపు రూ. 61, 991 మేర డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా దీన్నికొనాలనుకుంటే రూ. 1200వరకు తగ్గింపు ఉంటుంది. అప్పుడు మీరు ఏకంగా రూ. 63,191 మేర తగ్గింపు మీకు లభిస్తుంది.

ఇక ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 1800వరకు డిస్కౌంట్ ఉంటుంది. అయితే మీరు పాత టీవీ ఆధారంగా ఎక్స్చేంజ్ ఆఫర్ మారుతుందని కంపెనీ తెలిపింది. ఇలా మీరు పలు రకాల డిస్కౌంట్ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో ప్రైమ్ వీడియో, యూట్యూబ్ సహా పలు ఓటీటీ యాప్స్ కూడా చూడవచ్చు. అయితే వీటి సబ్ స్క్రిప్షన్ మాత్రం ఉండాలి. ఈ టీవీలో 30వాట్ సౌండ్ ఔట్ ఫుట్ ఉంటుంది. రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్ . 4కే డిస్ ప్లే వస్తుంది. మీరు ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా ఈ స్మార్ట్ టీవీనికొనుగోలు చేయవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్స్ ఉంటుంది. నెలవారీ ఈఎంఐ రూ. 2667 నుంచి ప్రారంభం అవుతుంది. 9నెలల టెన్యూర్ పై దీన్నికొనుగోలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: పేటీఎం వాలెట్ పై ముఖేష్ అంబానీ కన్ను?

ఇక మీ దగ్గర క్రెడిట్ కార్డు లేకున్నా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ పే లెటర్ ద్వారా కూడా ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. లేదంటే బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Stock Market: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్లోజ్..నష్టాల్లో భారత సూచీలు

భారత్ ఇచ్చిన షాక్ కు పాకిస్తాన్ విలవిలలాడుతోంది. అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్న దాయాది పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారిపోయింది. దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్లో కూడా సూచీలు భారీ నష్టాలు చూస్తున్నాయి. 

New Update
pak

Pakistan Stock Exchange

భారత్‌- పాక్ యద్ధం నేపథ్యంలో..పాకిస్తాన్ స్టాక్ ఎక్సెంజ్‌ మూసేసింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ ను కొనసాగించలేమని చెప్పింది. మళ్ళీ కొన్ని రోజుల్లో కలుస్తామని అంది. కాశ్మీర్ లో ఉగ్రదాడి, దానికి నిరసనగా భారత్ చేపట్టిన చర్యలు పాకిస్తాన్ ను చాలా బలంగానే దెబ్బ కొడుతున్నాయి.  వరుసగా 2 రోజుల నుంచి పాక్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మునిగి తేలుతున్నాయి. అసలే ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్న దాయాదికి ఇది పుండు మీద కారం జల్లినట్టయింది. భారత్ ఇచ్చిన షాక్ కు పాక్ విలవిల కొట్టుకుంటోంది. ఏం చేయాలో తెలియక ఏకంగా స్టాక్ ఎక్స్చేంజ్ నే మూసేసుకుంది. 

exchange
Pakistan Stock Exchange

 

భారత్ లోనూ నష్టాలు..

నిన్నటి వరకు బాగానే ఉన్న భారత స్టాక్ మార్కెట్ ఈరోజు మాత్రం నేల చూపులు చూస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ దేశీయంగా కొనుగోళ్లు ఎక్కువగా అవుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లు (1.26%) తగ్గి 78,950 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 350 పాయింట్లు (1.44%) తగ్గి 23,900 స్థాయిలో ట్రేడవుతోంది. 30 సెన్సెక్స్ స్టాక్‌లలో 28 స్టాక్‌లు నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ 4.50% వరకు క్షీణించాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, జొమాటో షేర్లు 3% తగ్గాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కాస్త పర్వాలేదనిపిస్తున్నాయి. ఇక నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 48 స్టాక్‌లు నష్టాల్లో ఉన్నాయి. NSE మీడియా రంగం 3.46%, ప్రభుత్వ బ్యాంకింగ్ 2.96%, ఫార్మా 2.55%, మెటల్ 2.44% మరియు ఆటో 2.00% క్షీణించాయి. ఐటీ స్టాక్స్‌లో స్వల్ప పెరుగుదల ఉంది. నిన్నటి వరకు బాగానే ఉన్న దేశీ మార్కెట్ ఈరోజు పడిపోవడానికి కారణం భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులే అంటున్నారు నిపుణులు. 

 today-latest-news-in-telugu | stock-market | india 

Also Read: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్

Advertisment
Advertisment
Advertisment