Health Tips : వైన్, బీర్ తాగుతే అందం పెరుగుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. కొంతమంది చిన్న వయసులోనే వారి ముఖంలో యవ్వనత్వం తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది. అలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైన్, బీర్ కూడా మనిషికి అందాన్నిస్తుందట. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

New Update
Health Tips : వైన్, బీర్ తాగుతే అందం పెరుగుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

Health Tips : జీవనశైలిలో మార్పులు, కాలుష్యం కారణంగా ముఖంలో చాలా తేడాలు వచ్చేస్తున్నాయి. అందం తగ్గినట్లు అనిపిస్తుంది. ఈ బిజీలైఫ్ లో శరీరం, అందంపై ప్రత్యేక శ్రద్దవహించే సమయం ఉండటం లేదు. దీంతో చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. ముడుతల పడే చర్మం కోసం మీరు ఇంట్లో తయారు చేసిన రకరకాల ఫేస్ ప్యాకులను ఉయోగించవచ్చు. ఇవన్నీ కూడా చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అయితే వైన్, బీర్ తాగుతే కూడా అందాన్ని మెరుగుపరుచుకోవచ్చని పలువురు అంటున్నారు. వైన్ , బీర్ వంటివి చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుతాయి?అధ్యయనాలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం.

వైన్ అంటే ఏమిటి?
వైన్ ఒక ఆల్కహాలిక్ డ్రింక్. ద్రాక్ష పండ్లను ఈస్ట్‌తో కలిపి పులియబెట్టినప్పుడు, చక్కెర కంటెంట్ కార్బన్ డయాక్సైడ్‌గా మారుతుంది. ఈ ప్రక్రియలో ఇథనాల్ విడుదల అవుతుంది. పండ్లను పులియబెట్టడం ద్వారా వైన్ తయారు చేస్తారు.

బీర్ అంటే ఏమిటి?
బీర్ కూడా ముడి పదార్థాలను నీటితో ఉడకబెట్టడం లేదా పులియబెట్టడం ద్వారా పొందిన ఆల్కహాలిక్ పానీయం. ఇది బియ్యం, వోట్స్, గోధుమలతో తయారు చేస్తారు.

వైన్ చర్మానికి మంచిదా?
వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అయిన టానిన్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇది చర్మంలోని కొల్లాజెన్‌ను పునరుద్ధరిస్తుంది. వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది.

బీర్ చర్మానికి మంచిదా?
ఇది చర్మానికి పోషణనిస్తుంది. విటమిన్ బిని కలిగి ఉంటుంది, ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,పోషణగా ఉంచుతుంది.

వైన్ చర్మకాంతిని పెంచుతుందా?
వైన్‌లోని పాలీఫెనాల్ కంటెంట్ డల్ చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మచ్చలను తొలగిస్తుంది.

బీర్ చర్మాన్ని మెరిసేలా చేస్తుందా?
బీర్‌లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మం యొక్క pH బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.

రెండింటిలో చర్మానికి ఏది మంచిది?
తాజా రెడ్ వైన్, బీర్ రెండూ వివిధ రకాల చర్మ ప్రయోజనాలను అందిస్తాయి. కానీ రెండింటినీ చాలా పొదుపుగా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే, అందులోని ఆల్కహాల్ శరీర ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇది కూడా చదవండి: ఒక్క ఐడియా రైతు జీవితాన్ని మార్చేసింది..50వేలు ఖర్చు చేసి 2.5లక్షల సంపాదించిన ఓ రైతన్న సక్సెస్ స్టోరీ ఇదే.!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hanuman Shobha Yatra : జై శ్రీరాం నినాదాలతో మార్మోగుతున్న హైదరాబాద్

‘జై బోలో హనుమాన్‌కి, జైశ్రీ రాం’ అంటూ భక్తుల ఆధ్యాత్మిక నినాదాలతో హైదరాబాద్ మార్మోగుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. కాగా గ్రేటర్ హైదరాబాద్‌లో వీర హనుమాన్ శోభాయాత్రలు జరుగుతున్నాయి.

New Update
Hanuman Shobha Yatra

Hanuman Shobha Yatra

Hanuman Shobha Yatra :హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. శనివారం తెల్లవారు జామునుంచే భక్తులు హనుమాన్ ఆలయాలకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ వీర హనుమాన్ శోభాయాత్రలు జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ నుంచి నేటి మధ్యాహ్నం ప్రారంభమైంది.. గౌలిగూడ నుంచి కోరి, నారాయణగూడ బైపాస్ మీదుగా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగనుంది. భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో వేలాది వాహనాలతో పాటు లక్షలాది మంది భక్తులు పాల్గొనడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.12 కిలోమీటర్ల యాత్రకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ గౌలిగూడలోని శ్రీరామ మందిరానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
Also Read: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
 
 ‘జై బోలో హనుమాన్‌కి, జైశ్రీ రాం’ అంటూ భక్తుల ఆధ్యాత్మిక నినాదాలతో హైదరాబాద్ మార్మోగుతోంది. యువత ఉత్సాహంతో జై హనుమాన్‌ అంటూ నినదిస్తున్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే శోభాయాత్రలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశ్చిమ మండలం పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.గౌలిగూడ నుంచి సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌ వరకు కొనసాగనున్న ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో హనుమాన్‌ శోభాయాత్రకు ముస్లిం సోదరులు స్వాగతం పలికి మతసామరస్యాన్ని చాటారు.  

 పశ్చిమ మండలం పరిధిలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఫిలింనగర్‌, సంజీవరెడ్డినగర్‌, మధురానగర్‌, బోరబండ, మాసబ్‌ట్యాంక్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఇప్పటికే ర్యాలీలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహిస్తారనే దానిపై పోలీసులకు స్పష్టత వచ్చింది. కొన్ని ర్యాలీలు ఉత్సవాలు జరిగే ఆలయాల పరిధిలోనే జరుగుతుండగా, మరికొన్ని ప్రధాన ర్యాలీల్లో కలుస్తుండటంతో అందుకు అనుగుణంగా అదనపు బలగాలను రంగంలోకి దించారు. సుమారు రెండు వేల మందికి పైగా అదనపు సిబ్బందిని హనుమాన్‌ శోభాయాత్ర బందోబస్తుకు ఉపయోగించనున్నారు. ఆలయాల వద్ద కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయాలకు వచ్చే మహిళా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మహిళా సిబ్బందిని వినియోగిస్తున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

 

Advertisment
Advertisment
Advertisment