Petrol Rate Today: టెన్షన్ లేదు.. పెట్రోల్ డీజిల్ ధరలు మారలేదు!! అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అయినా దేశీయంగా మాత్రం ఆ ప్రభావం పడలేదు. భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 28 Aug 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Petrol Rate Today: క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా కొద్దిగా పెరుగుదల కనబరిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌కు 79.99 డాలర్లుగా ఉంది. WTI ముడి చమురు 75.92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. Petrol Rate Today: ముడి చమురు ప్రధాన దిగుమతిదారుగా, భారతదేశం పెట్రోల్, డీజిల్ ధరలు భారత్, US డాలర్ మధ్య మారకం రేటు ద్వారా ప్రభావితమవుతాయి. పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ కూడా వాటి ధరలపై ప్రభావం చూపుతుంది. ఈ ఇంధనాలకు డిమాండ్ పెరిగితే, అది అధిక ధరలకు దారితీయవచ్చు. Petrol Rate Today: పెట్రోలు - డీజిల్ ధర ముడి చమురును శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చుతో ప్రభావితం అవుతుంది. శుద్ధి ప్రక్రియ ఖరీదైనది అలాగే ఉపయోగించిన ముడి చమురు రకం, రిఫైనరీ సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా శుద్ధి ఖర్చులు మారవచ్చు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు మన దేశంలో ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులు, రవాణా ఛార్జీలు ఆధారంగా వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉంటాయి. ఈరోజు అంటే 28.08.2024 ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72, డీజిల్ ధర రూ.87.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.44, డీజిల్ ధర రూ.89.97గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.95, డీజిల్ ధర రూ.91.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.75, డీజిల్ ధర రూ.92.34గా ఉంది. నోయిడా: లీటర్ పెట్రోల్ రూ. 94.83, డీజిల్ రూ. 87.96 గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ రూ. 95.19, డీజిల్ రూ. 88.05. బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ.102.86, డీజిల్ రూ.88.94. చండీగఢ్: లీటర్ పెట్రోల్ రూ.94.24, డీజిల్ లీటర్ రూ.82.40, హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65. జైపూర్: లీటర్ పెట్రోల్ రూ.104.88, డీజిల్ రూ.90.36. పాట్నా: లీటర్ పెట్రోల్ రూ.105.18, డీజిల్ రూ.92.04. #petrol-price #petrol-rate-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి