Chandrababu naidu: బావ బామ్మర్దిలిద్దరినీ అరెస్ట్‌ చేసింది ఒకే అధికారి!

అప్పుడు బాలకృష్ణ ఇప్పుడు చంద్రబాబు..బావ బామ్మర్ధిలను ఇద్దరినీ కూడా అరెస్ట్‌ చేసింది సంజయ్‌ నే కావడంతో ప్రధానంగా ఆయన పేరు తెర మీదకి వచ్చింది.

New Update
Chandrababu naidu: బావ బామ్మర్దిలిద్దరినీ అరెస్ట్‌ చేసింది ఒకే అధికారి!

ఏపీ(Andhrapradesh) లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నంద్యాల పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కామ్ కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2004 సంవత్సరంలో ఓ కాల్పుల కేసులో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను అరెస్ట్‌ చేసిన పోలీసు అధికారే ఒకరే కావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారింది.

ఆయనే సీనియర్‌ పోలీసు అధికారి ఏపీ సీఐడీ చీఫ్‌ ఎన్‌ సంజయ్‌. వైఎస్సాఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో 2004 లో ఇప్పటి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణను కూడా ఓ కేసులో అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో ఆయనను అరెస్ట్ చేసింది కూడా సంజయ్‌ నే.

2004 లో బాలకృష్ణ కొందరి మీద తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆయన్ను అదుపులోనికి తీసుకుని ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. ఆ సమయంలో సంజయ్‌ హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు గా ఉన్నారు.

అప్పుడు బాలకృష్ణ ఇప్పుడు చంద్రబాబు..బావ బామ్మర్ధిలను ఇద్దరినీ కూడా అరెస్ట్‌ చేసింది సంజయ్‌ నే కావడంతో ప్రధానంగా ఆయన పేరు తెర మీదకి వచ్చింది. సంజయ్‌ ప్రస్తుతం ఏపీ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ కు అడిషనల్‌ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్‌ డెవలప్ మెంట్‌ స్కీమ్‌ స్కామ్‌ కేసులో సుమారు రూ.371 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్‌ బృందం తన వాదనలు వినిపిస్తుంది.

వైఎస్సాఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నా మీద 27 కేసులు పెట్టినా కూడా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు స్వయంగా చాలాసార్లు చెప్పారు. చంద్రబాబు ఎంత గట్టిగా తన వాదనలు, ప్రతివాదనలు వినిపించినప్పటికీ కూడా ఆ సీఐడీ అధికారి ఆయన్ను రిమాండ్‌ కు తరలించారు. దాంతో ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం సంజయ్‌ హాట్‌ టాపిక్‌ గా మారారు.

శనివారం బాబును అరెస్ట్ చేసిన క్రమంలో రాష్ట్రంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందుస్తు చర్యలుగా రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నిలిపివేసింది. ఆదివారం రాత్రి ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించిన క్రమంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు బంద్‌ కు పిలుపునిచ్చాయి. ఆ బంద్‌ కు జనసేన పూర్తి మద్దతుని ప్రకటించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు