Ayodhya Ram Mandir: అయోధ్యలో రెచ్చిపోతున్న దొంగలు.. 60 మంగల సూత్రాలు చోరీ..

అయోధ్యలో భక్తుల రద్దీని అవకాశంగా భావిస్తున్న దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కరీంనగర్‌కు చెందిన ఓ మహిళ మంగలసూత్రాన్ని దొంగలు ఎత్తుకెళ్లడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు 60 మంగలసూత్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు.

New Update
Ayodhya Ram Mandir: అయోధ్యలో రెచ్చిపోతున్న దొంగలు.. 60 మంగల సూత్రాలు చోరీ..

Robbery in Ayodhya Ram Mandir: ఈ ఏడాది జనవరి 22న ఉత్తరపప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా రామమందిర ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోజు నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు రాములవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. అయితే భక్తుల రద్దీని అవకాశంగా భావిస్తున్న దొంగలు (Thieves) రెచ్చిపోతున్నారు. భక్తులకు సంబంధించిన నగదు, బంగారం అలాగే ఇతర విలువైన భక్తులు ఎత్తుకెళ్తున్నారు. అయితే ఇటీవల కరీంనగర్‌కు (Karimnagar) చెందిన కొంతమంది భక్తులు రామ్‌లల్లాను (Ram Lalla) దర్శించుకునేందుకు అయోధ్యకు వెళ్లారు.

Also Read: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్.. వౌకౌట్‌ చేసిన విపక్షాలు

భద్రతాలోపం వల్లే 

వాళ్లలో ఓ మహిళకు చెందిన బంగారాన్ని దొంగలు చోరీ చేశారు. దీంతో ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటివరకు.. 60 మంది మహిళల మంగళ సూత్రాలు చోరీకి గురయ్యాయని పోలీసులు చెబుతున్నారు. మరోవిషయం ఏంటంటే.. రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన తర్వా భద్రతా ఏర్పాట్లను సడలించడం వల్ల దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చర్యలు తీసుకోండి 

అంతేకాదు అక్కడ పలు ప్రాంతాల్లో ఉండే సీసీ కెమెరాలను కూడా తొలగించడం దొంగిలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పలుమార్లు దొంగతనాలు వెలుగుచూడటంతో అయోధ్యకు వచ్చే భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని.. భద్రతను పటిష్ఠం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: రైతుల ధర్నా…మార్చి 12 వరకు ఢిల్లీలో 144 సెక్షన్

Advertisment
Advertisment
తాజా కథనాలు