పోలీసులు బూతులు తిట్టారని స్టేషన్ లోనే యువకుడి దారుణం.. ఏం చేశాడంటే

ఏ తప్పు చేయకుండానే పోలీసులు అదుపులోకి తీసుకుని అన్యాయంగా కొట్టారంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా యర్రగొంపాలెంలో చోటుచేసుకుంది. అదే పోలీస్టేషన్ లో మోజేష్‌ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

New Update
పోలీసులు బూతులు తిట్టారని స్టేషన్ లోనే యువకుడి దారుణం.. ఏం చేశాడంటే

స్నేహితుల మధ్య చిన్న గొడవ ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఒకే కాలేజీలో చదువుతున్న యువకులంతా ఓ విషయంలో గొడవపడుతుండగా అటువైపుగా వచ్చిన పోలీసులు ఒక అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, గొడవతో తనకు సంబంధం లేదని చెప్పిన వినకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చితకబాదారు. అంతేకాదు తన పేరెంట్స్ ను పోలీసులు దుర్భాషలాడంతో మనస్తాపానికి గురైన యువకుడు అదే పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఈ మేరకు ప్రకాశం మార్కాపురం పోలీసులు, బాధితుడు, కుటుంబసభ్యులు తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యర్రగొండపాలెంలోని గాయత్రి సినిమాహాలు సమీపంలో నాగెపోగు నరసింహారావు కుటుంబం నివాసముంటోంది. వారి కుమారుడు మోజేష్‌ (19) దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం మాచర్ల రోడ్డులోని రాళ్లవాగు వంతెన పక్కన కొందరు యువకులు గొడవ పడ్డారు. పోలీసులు వెళ్లి, ఆ సమయంలో అక్కడున్న మోజేష్‌, సుభాని అనే యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. మోజేష్‌ తండ్రిని పిలిచి ఇష్టమొచ్చినట్లు దూషించారు. అదేరోజు రాత్రి వారిని ఇంటికి పంపించిన పోలీసులు బుధవారం మళ్లీ రమ్మని చెప్పారు. బుధవారం ఉదయం సైతం కొట్టి, తన తండ్రిని ఎస్సై, సీఐ ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి :కాంగ్రెస్‌ 6 గ్యారంటీల అమలు.. ఏటా ఎన్ని కోట్లు కావాలంటే!

అయితే ఈ క్రమలోనే మోజేష్‌ తీవ్ర మనస్తాపానికి గురై పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే బుధవారం సాయంత్రం ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకోవడంతో కేకలు వేస్తూ స్టేషన్‌ నుంచి బయటకొచ్చి ఎదురు వీధిలోని నీళ్ల డ్రమ్ములో పడ్డాడు. ఎస్సై రాజేష్‌, సిబ్బంది హుటాహుటిన అతణ్ని మార్కాపురం వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. అయితే ఈ సంఘటనలో మోజేష్‌ శరీరం దాదాపు 50 శాతం కాలిపోయినట్లు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల వైద్యులు వెల్లడించగా.. అక్కడ్నుంచి మార్కాపురంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెడికో లీగల్‌ కేసు పెట్టకుండా వైద్యం చేయలేమని చెప్పడంతో బాధిత కుటుంబసభ్యులతో రాజీకి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అకారణంగా తమ బిడ్డను పోలీసులు కొట్టడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్‌ ముందు రోడ్డుపై నిరసన చేపట్టారు. తమ బిడ్డకు న్యాయం జరిగేంతవరకూ ఊరుకునేది లేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: ఎంత ధైర్యం.. ప్రభాస్‌ను ఏంటి భయ్యా అఘోరీ ఇలా అనేసింది- దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!

నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందో? కలిస్తే ఒక్క సెల్ఫీ అడుగుతాను అని వర్షిణి తెలిపింది. వెంటనే అఘోరీ ఏంటీ ప్రభాస్ గోల ఆపు అనేసింది. అది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీంతో అఘోరీని ట్రోల్ చేస్తున్నారు.

New Update

అందరూ ఊహించినట్లుగానే లేడీ అఘోరీ-శ్రీవర్షిణీ మ్యారేజ్ చేసుకున్నారు. అదీ ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు వివాహం చేసుకున్నారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌లో బ్రహ్మముహుర్తాన తెల్లవారిజామున 4 గంటలకు వర్షిణీ మెడలో అఘోరీ తాళి కట్టింది. రెండోసారి వర్షిణీ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే బంగారం చైన్‌ను మెడలో వేసి మ్యారేజ్ చేసుకుంది. ఇది గడిచి చాలా రోజులే అయింది. కానీ ఇప్పుడే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

ప్రభాస్ అంటే ఇష్టం

వర్షిణీ మళ్లీ అఘోరీ చెంతకు చేరుకుంది. అక్కడ నుంచి RTVతో లైవ్ లో మాట్లాడిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తమ ఇష్యూలోకి ప్రభాస్‌ను లాగారు. ప్రభాస్ లాంటి అబ్బాయిని పెళ్లిచేసుకోవాలనిపించలేదా? అనే ప్రశ్నకు వర్షిణీ మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ లాంటి అబ్బాయి ఉండడని అనుకున్నాను. కేవలం హీరోస్‌లోనే ఇష్టం.. రియల్ లైఫ్‌లో కాదు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

ప్రభాస్‌ను డైరెక్ట్‌గా ఎప్పుడూ చూడలేదు. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నాను. ప్రభాస్‌ను ఫస్ట్ టైం షూటింగ్ లో కానీ ఎక్కడైనా కలిస్తే ఆయన దగ్గరకి వెళ్లి.. హాయ్ సర్ ఐయామ్ బిగ్ ఫ్యాన్‌ ఆఫ్ యు డార్లింగ్ అని చెప్తాను. అంతేకాకుండా ఒక సెల్ఫీ కూడా అడుగుతాను. అఘోరీని కూడా డార్లింగ్ అని పిలిస్తాను’’ అని అఘోరీని డార్లింగ్ అని పిలిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

అయితే వర్షిణీ ప్రభాస్ గురించి మాట్లాడుతుండగా.. సరిగ్గా అప్పుడే అఘోరీ వచ్చి ఏంటీ ప్రభాస్ గోల అని లైవ్‌లో అనేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తిపోయింది. ఒక్కసారిగా వారు షాక్ అయిపోయారు. తమ అభిమాన హీరో గురించి అఘోరీ అలా అనడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

(aghori | sri varshini | aghori sri varshini | Aghori Sri Varshini Lov | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment