Shri Chaitanya: శ్రీ చైతన్య స్కూల్ నిర్వాకం.. విద్యార్థి కాలు విరగొట్టిన ఉపాధ్యాయుడు శ్రీ చైతన్య స్కూల్ లో మరో నిర్వాకం బయటపడింది. కరెన్సీ నగర్ స్కూల్లో 9వ తరగతి చదవుతున్న బాలుడు హోంవర్క్ కంప్లీట్ చేయలేదని ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా కొట్టాడు. అంతేకాదు విద్యార్థిని తన్నడంతో కాలు విరింగిందని ఆరోపిస్తూ స్కూల్ ముందు పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. By srinivas 30 Dec 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Shri Chaitanya: శ్రీ చైతన్య స్కూల్ లో మరో నిర్వాకం బయటపడింది. హోంవర్క్ రాయలేదని కారణంతో ఓ విద్యార్థిని విచక్షణ రహితంగా చితకబాదిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. Your browser does not support the video tag. ఈ మేరకు కరెన్సీ నగర్ లోని శ్రీ చైతన్య స్కూల్ లో 9వ తరగతి చదవుతున్న బాలుడు తాను చెప్పిన హోంవర్క్ కంప్లీట్ చేయలేదని ఆగ్రహానికి లోనైన ఉపాధ్యాయుడు శనివారం ఉదయం దారుణంగా కొట్టాడు. అంతేకాదు కాలుతో విద్యార్థిని తన్నడంతో విద్యార్థి అక్కడికక్కడే కూలిపోగా.. వెంటనే స్కూల్ సిబ్బంది దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకుని కుమారుడిని పరిశీలించగా తమ కొడుకు కాలు విరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఎదుట విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తన ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. #teacher #student #shri-chaitanya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి