Telangana Assembly Session: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ..గ్యారెంటీ హామీల అమలే లక్ష్యం..!! తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ తొలి సమావేశం నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ప్రొటెం స్పీకర్ గా అక్భరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయనున్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణం స్వీకారం చేయిస్తారు. By Bhoomi 09 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Assembly Session: నేటి నుంచి తెలంగాణలో మూడో ప్రభుత్వ మొదటి అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఉదయం 8.30కి సమావేశాలు ప్రారంభం అవ్వగానే గవర్నర్ తమిళిసౌ సౌందర రాజన్ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీతో (Akbaruddin Owaisi) ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత చిన్న విరామం ఉంటుంది. తిరిగి ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈసారి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఉండనుంది. వారు బాధ్యతలు తీసుకుంటారు. ఈ సమయంలోనే రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం తొలిరోజు సమావేశాలు ముగుస్తాయి. కాగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతున్నాయన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. తొలిరోజు చర్చలు ఉండవు కాబట్టి..మరో మూడు రోజులు ఉండవచ్చనే అంచనా ఉంది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను అన్ని పార్టీలతో కలిసి బీఏసీ లో చర్చిస్తారు. కాగా స్పీకర్ గా అక్బరుద్దీన్ ని ఎంచుకోవడానికి ప్రధానకారణం ఉంది. ఆయన ఇఫ్పటివరకు ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎక్కువ సార్లు ఎన్నికైన వారికి ఈ అవకాశం ఇస్తారు. ఇలా ఆరుసార్లు ఎన్నికైనవారు బీఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) లో ఉన్నారు. అయితే ప్రతిపక్ష నేతను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేస్తారు. అందుకే అక్బరుద్దీన్ ఓవైసీకి ఈ ఛాన్స్ఇచ్చారు. కాగా ఈ సమావేశాల్లో ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇవాళ అమలు చేస్తున్న రెండు గ్యారెంటల పథకాలతోపాటు మిగతా పథకాలకు ఈ సమావేశాల్లోనే నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన బిల్లులను కూడా ఆమోదించే అవకాశం ఉంది. విద్యుత్ శాఖలో 80వేల కోట్లకు పైగా అప్పలు ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఎన్నికలకు ముందు ఈ విషయం బయటపడలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు ఈ విషయాన్ని బయటపెట్టడంతో ఈ అప్పుల భారాన్ని ఎలా తగ్గించాలనేది పెద్ద సవాలుగా మారింది. దీనిపై సభలో చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రివిగుప్తా, పోలీస్ కమిషన్ సందీప్ శాండిల్య, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పరిశీలించారు. సభ జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ప్రాంగణం, వెలుపల ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు, సభ వెలుపల ట్రాఫిక్ విధుల నిర్వహణ వంటి అంశాలపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. ఈసారి అసెంబ్లీలో 51 మంది కొత్తఎమ్మెల్యేలు అడుగుపెడుతున్నారు. వీరిలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి ఈసారి ఏకంగా 8మంది కొత్తవారు ఎన్నికయ్యారు. కొత్తగా అడుగుపెడుతున్నవారిలో 51మంది ఎమ్మెల్యేలకు ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోవడం గమనార్హం. వీరంతా తొలిసారి పోటిచేసి గెలుపొందినవారే. ఇది కూడా చదవండి: నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం…అయితే ఈ కార్డు ఉండాల్సిందే..డౌన్ లోడ్ చేసుకోండిలా..!! #congress #cm-revanth-reddy #telangana-assembly-session #aimim-mla-asaduddin-owaisi #assembly-session మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి