Seethakka: నక్సలైట్ నుంచి మినిస్టర్ వరకూ ఫైర్ బ్రాండ్ సీతక్క జర్నీ!

మావోయిస్టు జీవితం నుంచి లాయర్ గా మారి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకొని నేడు మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క జీవితం ఎంతో మందికి ఆదర్శం. నక్సలైట్ నుంచి మినిస్టర్ వరకూ ఎదిగిన ఫైర్ బ్రాండ్ సీతక్క జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్‌ మొత్తం చదవండి.

New Update
Seethakka: నక్సలైట్ నుంచి మినిస్టర్ వరకూ  ఫైర్ బ్రాండ్ సీతక్క జర్నీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్రోగించిన విజయ దుందుభి భారత దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా మంత్రిగా భాద్యతలు చేపట్టారు.సీతక్క ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో తన సేవలతో రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన సీతక్క(Seethakka).. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్బంగా నక్షలైట్ నుంచి మినిష్టర్ దాకా సాగిన రాజకీయ ప్రస్థానంపై ఓ లుక్కేయండి.

అన్నాయాలను ప్రశ్నించే తత్వం:
సీతక్క అసలు పేరు అనసూయ దంసారి. వరంగల్ జిల్లా ములుగు మండలం.. జగన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో జులై 9, 1971 లో జన్మించారు సీతక్క . .సమ్మయ్య, సమ్మక్క దంపతులకు రెండో సంతానంగా పుట్టిన సీతక్క ములుగు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ.. పదవ తరగతి వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచే ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మొదలు పెట్టారు.

విద్యార్థి దశ నుంచే పోరాట జీవితం:
తెలంగాణ కాంగ్రెస్ లో మహిళా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న సీతక్క ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక సెంటిమెంట్ గా మారారు అనడంలో అతిశయోక్తి లేదు. విద్యార్థి దశ నుంచే పోరాట జీవితం మొదలు పెట్టిన ఆమె.. జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారితో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వచ్చారు. గిరిజనులపై అటవీ అధికారుల దాష్టికం, ఆదివాసీలపై రాజకీయ నాయకులు.. వారికి సహకరిస్తూ పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై సీతక్క కన్నెర్ర చేశారు.

జనజీవన స్రవంతిలోకి:
నక్సల్స్ లో చేరిన తర్వాత ప్రజలకు న్యాయం చేయాలనే తన ఆకాంక్షను నెరవేర్చడం ప్రారంభించారు. అలా అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం పదిహేనేళ్ళకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు. తన బావ శ్రీరాముడిని పెళ్లి చేసుకొని తన పేరు సీతక్కగా మార్చుకున్నారు. కొడుకు పుట్టిన తర్వాత దళంలో ఉండలేక 1996 లో జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు. అప్పట్లో ఆమెకు పోలీస్, రాజకీయ వర్గాల నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా.. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ లో ఉద్యోగినిగా చేరి చదువును కొనసాగించారు.

ఎల్‌ఎల్‌బీ పూర్తి:
నెలవారి జీతం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు సీతక్క. ప్రజా సేవ చేయాలనే ఆమె ఆకాంక్ష రాజకీయాల వైపు దృష్టి మల్లేలా చేసింది.సామాజిక సేవలో చురుకుగా ఉండి, స్థానికంగా నాయకురాలిగా మంచి పేరు ఉండటంతో ఆనాటి ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పోరుబాటను వీడిన సీతక్క రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఆమెకు ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీచేసే అవకాశం కల్పించింది.అయితే తొలి అడుగుతోనే పరాజయంపాలయింది.

తొలిసారి అసెంబ్లీలోకి:
2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించి
తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు సీతక్క. ఇక.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థినిగా బరిలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు.

టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు:
ఈ ఓటమితో టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్ పై 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ పై గెలిచింది. 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితురాలైంది. ఇక.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా నియమితులయ్యారు.

వరంగల్‌, ఖమ్మం జిల్లాలలో అడవులలో నివసించే సంచారజాతికి చెందిన గుత్తికోయలు ఏవిదంగా సమాజంలో నిరాదరణకు గురవుతున్నారో, ఏవిదంగా వారికి హక్కులు నిరాకరించబడుతున్నాయనే అంశాలపై పీహెచ్‌డీ చేసి ఉస్మానియా యూనివర్సిటీ సీతక్కకు గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేశారు. ఒక సామాన్య మహిళ తన చుట్టూ ఉన్న ప్రజల కష్టాలపై స్పందించి.. వారి కోసం చిన్నతనంలో పోరాటం మొదలు పెట్టి ..మావోయిస్టు జీవితం నుంచి లాయర్ గా మారి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకొని నేడు మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క జీవితం ఎంతో మందికి ఆదర్శం.

Also Read: 24 గంటల్లోపే యాక్షన్‌ ప్లాన్‌.. టార్గెట్‌ కేసీఆర్‌.. శ్వేతపత్రం రిలీజ్‌ నిర్ణయం వెనుక కారణం ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment