Crime News: హైదరాబాద్‌లో దారుణం.పెళ్లైన నెలకే భార్యను చంపి..భర్త ఏం చేశాడంటే?

హైదరాబాద్‌ చంపాపేటలో దారుణం జరిగింది. పెళ్లైన నెల రోజులకే భార్యను అతి కిరాతకంగా చంపాడు ఓ భర్త. స్వప్నను కత్తితో దారుణంగా హత్యచేశాడు. భార్యను చంపిన ఆనంతరం తాను బిల్డింగ్‌ పై నుంచి దూకాడు. ఈ సంఘటనతో చంపాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం భర్త ప్రేమ్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Crime News: హైదరాబాద్‌లో దారుణం.పెళ్లైన నెలకే భార్యను చంపి..భర్త ఏం చేశాడంటే?

Husband killed his Wife in Hyderabad Champapet : పెళ్లి అయిన కొత్తలో భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు అనే విధంగా ప్రేమను చూపించుకుంటారు. అలాంటిది..పెళ్లైన నెల రోజులకే భార్యను అతి క్రూరంగా చంపాడు ఓ భర్త. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్‌ చంపాపేటలో చోటుచేసుకుంది. స్వప్నను గొంతు కోసి అతి కిరాతకంగా చంపాడు భర్త ప్రేమ్ కుమార్. అసలు విషయం ఏంటంటే..

Also Read: అది తట్టుకోలేకే క్రిష్టియన్ సంస్థపై బాంబు దాడి.. నిందితుడి వీడియో వైరల్ .!

మహబూబ్‌నగర్ హన్వాడ తండాకు చెందిన స్వప్న తన భర్త ప్రేమ్ కుమార్ ..హైదరాబాద్ చంపాపేటలో నివాసం ఉండేవారు. అయితే, వీరి మధ్య ఏ విషయంలో గొడవలు వచ్చాయో తెలియదు కానీ భార్యను గొంతు కోసి హత్య చేశాడు భర్త. హత్య అనంతరం భర్త ప్రేమ్ కుమార్ కూడా రెండో అంతస్తు నుంచి కిందికి దూకాడు. పెద్ద శబ్ధం రావడంతో  స్థానికులు వెంటనే అప్రమత్తమైయ్యారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్ధాలానికి చేరుకుని గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

యువతి హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన పరిసరాలను క్లూస్ టీంతో పరిశీలిస్తున్నారు పోలీసు అధికారులు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనతో మరో ఇద్దరి యువకులకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆ  ఇద్దరు యువకులు పరారీలో ఉన్నట్లు సమాచారం. సరైన ఆధారాల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులకు సూచించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమా? లేదా మరేదైనా కారణం ఉందా? అన్న కోణాల్లో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: సినీ పరిశ్రమలో మరో విషాదం… నటుడు అనుమానాస్పద మృతి..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు.ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. బైక్ అదుపు తప్పడంతో అతడు కిందపడ్డాడు. దీంతో ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లింది.

New Update
Accident

Accident

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది. 

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

Advertisment
Advertisment
Advertisment