UPPAL : ఉప్పల్ లో దారుణం.. భార్యను వీడియోకాల్ లైవ్ లో ఉంచి భర్త ఏం చేశాడంటే..

సీమంతం కోసం పుట్టింటికి వెళ్లిన భార్యకు వీడియోకాల్ చేసి భర్త ఉరేసుకుని చనిపోయిన ఘటన ఉప్పల్ లో చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరుకు చెందిన నరేష్ మెట్రోలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య నిత్య సీమంతం విషయంలో గొడవ జరగడంతో మనస్థాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడు.

New Update
UPPAL : ఉప్పల్ లో దారుణం.. భార్యను వీడియోకాల్ లైవ్ లో ఉంచి భర్త ఏం చేశాడంటే..

UPPAL : హైదరాబాద్ ఉప్పల్ లో దారుణం చోటుచేసుకుంది. పుట్టింటికి వెళ్లిన భార్యాకు వీడియోకాల్ చేసి లైవ్ లో ఓ యువకుడు సూసైడ్ (Sucide) చేసుకున్న సంఘటన కలకలం రేపింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రపంచలోకి అడుగుపెట్టబోతున్న పసిగుడ్డును, కట్టుకున్న ఇల్లాలిని ఒంటరి చేసి భర్త ఆత్మహత్య చేసుకోవడం స్థానికులు, కుటుంబ సభ్యులను కలచివేసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలావున్నాయి. యాదాద్రి జిల్లా (Yadadri) పెద్ద కందుకూరుకు చెందిన ముత్తడి నరేష్‌(28) (Naresh) ఉప్పల్‌లోని సరస్వతి కాలనీలో భార్య నిత్యశ్రీ (Nithya sri) తో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది. నరేష్ మెట్రో (metro) రైలు సిగ్నలింగ్‌ విభాగంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. యాదాద్రి జిల్లా అమ్మనబోలు గ్రామానికి చెందిన నిత్య.. ఇటీవల గర్భం దాల్చడంతో వారం క్రితం సీమంతం కోసం పుట్టింటికి వెళ్లింది. అయితే ఈ పండుగ నేపథ్యంలో సీమంతానికి బంధువులను పిలిచే విషయంలో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో అదికాస్త గొడవలకు దారితీసింది. ఇదే క్రమంలో ఆస్తి తగాదాలు తలెత్తాయి. ఇరువురి కుటుంబ సభ్యులు సైతం గొడవలు పెట్టుకున్నారు.

ఇది కూడా చదవండి : Shri Chaitanya: శ్రీ చైతన్య స్కూల్ నిర్వాకం.. విద్యార్థి కాలు విరగొట్టిన ఉపాధ్యాయుడు

ఈ క్రమంలో ఎవరినీ బాధపెట్టలేక మనస్థాపానికి గురైన నరేష్‌ శుక్రవారం భార్యకు వీడియో కాల్‌ చేసి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. దీంతో వెంటనే చుట్టు పక్కల వారికి సమాచారం అందిచినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని, నరేష్ మరణించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime News: నాశనమైపోతార్రా.. 5 ఏళ్ల చిన్నారిని చంపి.. తల్లిపై మైనర్లు రేప్

హర్యానాలోని జింద్‌లో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై నలుగురు దుండగులు దాడి చేశారు. అందులో 5ఏళ్ల చిన్నారిని చంపి చెత్తకుండీలో పడేశారు. ఆపై బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆమె స్పృహ కోల్పోవడంతో అక్కడ నుంచి పరారయ్యారు.

New Update
Rape and murder Haryana

Rape and murder Haryana

కామాంధుల ఆగడాలు పెరిగిపోయాయి. ఆడది కనిపిస్తే చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా క్రూర మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ దారుణం జరిగింది. ఇంట్లో తన ముగ్గురు బిడ్డలతో నిద్రిస్తున్న ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

5 ఏళ్ల చిన్నారిని చంపి

ఈ ఘటన హర్యానాలోని జీంద్‌లో జరిగింది. మంగళవారం రాత్రి ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో గుడిసెలో నిద్రిస్తుంది. దీంతో ఆమె భర్త లేడని తెలుసుకున్న నలుగురు దుండగులు ఆ గుడిసెలోకి వెళ్లారు. అనంతరం పిల్లలతో కలిసి నిద్రిస్తున్న బాధితురాలిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

అదే సమయంలో ఆ బాధితురాలితో పాటు 5 ఏళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్తకుప్ప వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారి గొంతు నులిమి హత్య చేశారు. ఆపై బాధితురాలి పై దుండగులు నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఇక గొంతునులిమి హత్య చేసిన చిన్నారి.. డెడ్ బాడీ రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. ఇక గురువారం ఆ బాధితురాలు స్పృహలోకి వచ్చి.. జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై ఎస్‌ఐ. యశ్‌వీర్ మాట్లాడుతూ.. ఇందులో నిందితుడు అమిత్‌ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురు మైనర్లు ఉన్నారని వెల్లడించారు. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

telugu-news | crime news | Minor Girl Rape | latest-telugu-news | girl raped and murdered

Advertisment
Advertisment
Advertisment