Andhra Pradesh: ఏపీ గవర్నర్ సంచలన నిర్ణయం.. ఏఏజీ, సీఐడీ చీఫ్‌పై విచారణకు ఆదేశం..

ఏపీ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై విచారణ చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

New Update
Andhra Pradesh: ఏపీ గవర్నర్ సంచలన నిర్ణయం.. ఏఏజీ, సీఐడీ చీఫ్‌పై విచారణకు ఆదేశం..

Inquiry against the AAG and CID Chief of Andhra Pradesh: ఏపీ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుకు(Chandrababu) వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై విచారణ చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించిన కేసు విషయంలో సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రశ్నిస్తూ.. ఏఏజీ, సీఐడీ చీఫ్ ఇద్దరూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ కంప్లైంట్ చేశారు సత్యనారాయణ అనే వ్యక్తి. ఈ ఫిర్యాదు మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు గవర్నర్. వీరిద్దపై విచారణ చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

సీనియర్‌ ఐపీఎస్‌, సీఐడీ(CID) చీఫ్‌ సంజయ్‌ నేతృత్వంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు సహా, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా పలు కేసులపై విచారణ జరుగుతోంది. ఈ కేసులపై ప్రభుత్వం తరఫున రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (AAG) పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకానోక దశలో ఈ కేసులన్నీ బూటకమని, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నవన్నీ పచ్చి అబద్ధాలని టీడీపీ నేతలు ఆరోపించారు. అసలు జరిగింది ఒకటైతే.. అబద్ధాలతో సీఐడీ చీప్, ఏఏజీ ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..

ఈ ఆరోపణల నేపథ్యంలో.. చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించి వివరాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వెల్లడించారు ఏఏజీ పొన్నవోలు, సీఐడీ చీఫ్ సంజయ్. ఒకసారి హైదరాబాద్‌లో, ఒకరి ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ కేసు వివరాలను వెల్లడించారు. అయితే, కోర్టు పరిధిలో ఉన్న అంశంపై.. ప్రభుత్వాధికారులైన వీరు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించడం చట్ట విరుద్ధం అని, ప్రజా ధనాన్ని వీరు దుర్వినియోగం చేయడంతో పాటు.. అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడ్డారని ఆర్టీఐ కార్యకర్త సత్యనారాయణ రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కంప్లైంట్‌పై స్పందించిన గవర్నర్.. వారిద్దరిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు లేఖ రాశారు.

publive-image

ఇదికూడా చదవండి: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..

Advertisment
Advertisment
తాజా కథనాలు