16 ఏళ్ళ బాలిక మీద వర్చువల్ రేప్..ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు

యూకేలో ఒక విచిత్రమైన రేప్ కేసు నమోదయింది. 16 ఏళ్ళ బాలికను వర్చువల్‌గా రేప్ చేశారంటూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనివలన బాలిక శరీరానికి ఏమీ కాకపోయినా ఆమె తాను అత్యాచారానికి గురైనట్లు మానసిక వేదనను అనుభవిస్తోందని చెబుతున్నారు.

New Update
16 ఏళ్ళ బాలిక మీద వర్చువల్ రేప్..ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు

Virtual Rape case:మానసిక వేదనకు గురి చేయడం కూడా ఒక నేరమే. అయితే ఇందులో చాలా రకాలు ఉంటాయి. డైరెక్ట్ మనుషుల మీద ఎటాక్ చేయడం అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య వర్చువల్‌గా కూడా ఇవి ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు ఇందులో కూడా వింత కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కామెంట్స్ చేశారు, వీడియోలు పెట్టారు అంటూ కంప్లైంట్‌లు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు యూకేలో తనను వర్చువల్‌గా రేప్‌ చేశారంటూ ఒక 16 ఏళ్ళ అమ్మాయి కేసు పెట్టింది. దీని వలన తాను మానసికంగా బాధను అనుభవిస్తున్నానని చెబుతోంది.

Also read:టైమ్ అంటే టైమే…శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరో ఘనత

అసలేం జరిగింది అంటే...వర్చువల్ రియాలిటీ గేమ్‌లో 16 ఏళ్ల బాలిక డిజిటల్ అవతార్ లేదా డిజిటల్ క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులతో సామూహిక అత్యాచారం చేశారు. అమ్మాయి ఆన్‌లైన్ గేమ్‌లో లీనమై ఉండగా.. కొంతమంది పురుషులు ఆమె క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. బాలిక పరిస్థితిని అర్ధం చేసుకున్న పోలీసులు.. ఇందులో వాస్తవంగా బాలికపై అత్యాచారం జరగకున్నా, ఎలాంటి గాయాలు కాకున్నా కూడా ఆమె తాను అత్యాచారానికి గురైనట్లు మానసిక బాధను అనుభవిస్తోందని అంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న మొదటి వర్చువల్ లైంగిక నేరం ఇదే అని చెబుతున్నారు. ఈ మానసిక బాధను ఎక్కువ కాలం ఆమెపై ప్రభావం చూపించే అవకాశం ఉందని యూకే పోలీస్ అధికారి చెప్పారు. అయితే ప్రస్తుతం ఇలాంటి కేసులపై ప్రత్యేకంగా చట్టాలు లేవని, దీంతో ఈ కేసులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. అయితే, బాలిక ఏ గేమ్ ఆడుతుందనేది అస్పష్టంగా ఉందని చెప్పారు. ఈ కేసుపై యూకే హోం సెక్రటరీ జెమ్స్ క్లివర్లీ మాట్లాడుతూ.. బాలిక సెక్సువల్ ట్రామాలోకి వెళ్ళిందని తెలిపారు.

మరోవైపు ఆ అమ్ఇమాయి ఆడినది మెటా నిర్వహించే ఉచిత వీఆర్ గేమ్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తమ ప్లాట్‌ఫాంలో ఇలాంటి వాటికి స్థానం లేదని, మా వినియోగదారులకు ఆటోమాటిక్ రక్షణ ఉంటుందని, అపరిచిత వ్యక్తుల్ని దూరంగా ఉంచుతుందని మెటా ప్రతినిధులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tenth wife Murder: 9మంది భార్యలు వదిలేస్తే, పదో భార్యను భర్తే చంపేశాడు.. ఎందుకంటే?

ఛత్తీస్‌గఢ్‌ జాష్‌పూర్ జిల్లాలో ధులు రామ్‌కు 10మంది మహిళలతో వివాహమైంది. వివిధ కారణాలతో 9మంది భార్యలు అతనితో ఉండలేక వదిలేసి పోయారు. చివరి భార్య బసంతి బాయిని భర్త రాయితో కొట్టి చంపాడు. ఆమె తనని వదిలేస్తోందేమో అనే అనుమానంతో చంపానని రామ్ పోలీసులకు చెప్పాడు.

New Update
Tenth wife Murder

ధులు రామ్ పది మందిని మహిళలను వివాహం చేసుకున్నాడు. ఏ భార్య తనతో ఉండలేదు. పెళ్లైన కొన్నిరోజులకే అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. కానీ పదో సారి పెళ్లి చేసుకున్న మహిళను భర్త ధులు రామ్ హత్య చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లాలో భార్యను భర్త కిరాతకంగా చంపాడు. సులేసా గ్రామంలో నాలా దగ్గరున్న ఆదివారం ఓ గొయ్యిలో దుర్వాసన రావడం స్థానికులు గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఫోరెన్సిక్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుళ్ళిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ డెడ్‌బాడీ అదే గ్రామానికి చెందిన బసంతిగా బాయిదిగా గుర్తించారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతో మరణించినట్లు పోస్టుమార్టంలో తేలింది. పోలీసుల విచారణలో ఆమె చివరిసారిగా తన భర్తతో కనిపించిందని కూడా తెలిసింది.

Also read; BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ఆ అనుమానంతోనే హత్య..

నిందితుడిని ధులు రామ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. రామ్ చెప్పిన విషయాలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. అతనికి గతంలో 9సార్లు పెళ్లి అయ్యిందట. ఏదో కారణం చేత వారంత అతన్ని వదిలేసి వెళ్లారు. దీంతో బసంతి కూడా అతన్ని వదిలేసి వెదిలేసి వెళ్లిపోతుందేమో అని అనుమానం అతనికి వచ్చింది. పదే పదే అదే ఆలోచనతో రామ్‌కు 10వ భార్య బసంతిపై ఆందోళన ఎక్కువైంది. భార్య వదిలేసే కంటే ముందే ఆమెను హత్య చేయాలని రామ్ నిర్ణయించుకున్నాడు. మద్యమత్తులో బాక్సైట్ రాయితో భార్య తలపై కొట్టి చంపాడు. నేరాన్ని ఒప్పుకున్న రామ్‌ను అరెస్ట్ చేశారు. బసంతి మానసిక పరిస్థితి కూడా సరిగా ఉండేది కాదని పోలీసులు తెలిపారు.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

(Chhattisgarh Jashpur district | Husband Ki*ll*s Wife | husband-killed-wife | husband-killed-his-wife | chhattisgarh | crime news | latest-telugu-news | tenth wife)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు