Hyderabad : అన్నదమ్ముల షూ వివాదం.. అతిథిగా వచ్చిన అల్లుడు హతం అన్నదమ్ముల మధ్య మొదలైన షూ వివాదం అతిథిగా ఇంటికొచ్చిన అల్లుడి ప్రాణం తీసింది. రహ్మత్‌నగర్ కు చెందిన అభిలాష్, అభిషేక్ లు ఇంట్లో గొడవపడ్డారు. ప్రవీణ్ మోజెస్ కలగజేసుకుని ఆపేందుకు ప్రయత్నించగా అభిషేక్ కత్తితో పొడిచాడు. ప్రవీణ్ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 07 Feb 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Rahmat Nagar : అన్నదమ్ముల మధ్య మొదలైన షూ గొడవ అతిథిగా ఇంటికొచ్చిన అల్లుడి ప్రాణాలమీదకొచ్చింది. గొడవపడుతున్న మామలను ఓదార్చేందుకు వెళ్లిన యువకుడని కత్తితో పొడిచాడు దుర్మార్గుడు. ఈ భయంకరమైన సంఘటన హైదరాబాద్(Hyderabad) లోని రహ్మత్‌నగర్(Rahmat Nagar) లో చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ రిపేరు కోసం.. ఈ మేరకు మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాణి, సరోజ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. అయితే సరోజ కూతురు మార్తకు వివాహం జరగగా నిజాంపేటలో ఫ్యామిలీతో ఉంటున్నారు. మార్తకు ఇద్దరు కూతుళ్లు, సంగెపాగు ప్రవీణ్ మోజెస్(20) అనే కొడుకు ఉన్నారు. అతను కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే సెల్‌ఫోన్ రిపేరు కోసం ఈనెల 4న రాత్రి రహ్మత్‌నగర్‌లోని జవహర్‌నగర్ ప్రాంతంలో ఉంటున్న వరుసకు అమ్మమ్మ అయిన రాణి ఇంటికి వచ్చాడు ప్రవీణ్. రాణి పెద్ద కుమారుడు అభిలాష్ అలెక్స్, ప్రవీణ్ మోజెస్ ఈనెల 5న ఎర్రగడ్డలో సెల్‌ఫోన్ బాగు చేయించుకుని రాత్రి ఇంటికి వచ్చారు. ఇది కూడా చదవండి : kottagudem: ఇల్లందు మున్సిపాలిటీలో చల్లారని అవిశ్వాస సెగ.. కౌన్సిలర్ ఆస్తులపై దాడులు బూట్లు విప్పకుండా పడుకున్నాడని.. ఈ క్రమంలోనే అభిలాష్ అలెక్స్ సోదరుడు అభిషేక్ అలెక్స్ అలియాస్ బన్నీ బూట్లు విప్పకుండా మంచంపై నిద్రిస్తున్నాడు. ఇది గమనించిన అభిలాష్ అలెక్స్ బూట్లు విప్పి పడుకోవాలని తమ్మడు బన్నీకి చెప్పాడు. ఇందులో భాగంగానే అన్నదమ్ముల మధ్య గొడవ మొదలైంది. ఇది గమనించిన ప్రవీణ్ మోజెస్ కలుగజేసుకుని చిన్న విషయానికి ఎందుకు కొట్లాడుతున్నారని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ కోపోద్రోక్తుడైన అభిషేక్ అలెక్స్ క్షణికావేశంలో కత్తితో ప్రవీణ్ మోజెస్(Praveen Moje's) ను ఛాతీ ఎడమభాగంలో పొడిచాడు. ప్రవీణ్ అపస్మారకస్థితిలోకి చేరుకోవడంతో అమీర్‌పేట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. #hyderabad #crime #brothers-killed-uncle #rahmat-nagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి